ఈ రోజుల్లో కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు తెగబడుతున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, ప్రియుడు సినిమాకు తీసుకెళ్లలేదని, తండ్రి మందలించాడంటూ.. ఇలాంటి సిల్లీ రిజన్స్ కు హత్యలు చేయడం లేదంటే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ దుండగుడు థాంక్యూ చెప్పలేదని ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
అసలేం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా బ్రూక్లిన్ లోని పార్క్ స్లోప్ లోని 4వ అంతస్తులో ఓ స్మోకింగ్ దుకాణం ఉంది. ఇక్కడికి ఎంతో మంది వస్తూ, పోతూ ఉంటారు. అయితే ఇటీవల ఓ యువకుడు సైతం ఆ దుకాణంలోకి ఓ వచ్చాడు. అతను రాకను గమనించిన అందులో పని చేస్తున్న వ్యక్తి మెల్లగా డోర్ తీశాడు. దీంతో డోర్ తీసినందుకు ఆ వ్యక్తి థాంక్యూ చెప్పకుండా అలాగే వెళ్లిపోయాడు. డోర్ తీసిన వ్యక్తి అతని వద్దకు వెళ్లి థాంక్యూ ఎందుకు చెప్పలేదని అతనితో గొడవ పెట్టుకున్నాడు. నేను తెరమని చెప్పనే లేదు, నేనేందుకు థాంక్యూ చెప్పాలంటూ డోర్ తెరిచిన వ్యక్తికి సమాధానం ఇచ్చాడు.
దీంతో ఇదే విషమమై ఇద్దరి మధ్య కాస్త గొడవ రాజుకుంది. ఈ గొడవ మెల్ల మెల్లగా ఇద్దరు కొట్టుకునే దాక వెళ్లింది. ఇక వెంటనే డోర్ తెరిచిన వ్యక్తి కోపంతో ఊగిపోయి క్షణికావేశంలో తన వద్ద ఉన్న కత్తితో గొడవ పెట్టుకున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఈ వ్యక్తి చికిత్స పొందుతు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. థాంక్యూ చెప్పలేదని కత్తితో పొడిచి చంపిన దుండగుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.