ప్రేమికులు అన్నాక ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం కామన్. నాలుగు పెదాలు కలిసి ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడంతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయని మానసిక నిపుణులు, వైద్యులు చెబుతున్న మాట. ఇక పాశ్చత్య దేశాల్లో అయితే ప్రేమికులు ఈ పనిని నడి రోడ్డు మీదే కానిచ్చేస్తుంటారు. ముద్దు పెట్టుకుని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటుంటారు. అలా పెదవులను జుర్రుకుని నాలుగు పెదాలతో సరికొత్త రాగాన్ని ఆలపిస్తుంటారు. అయితే అమెరికాలోని ఓ ప్రియురాలు ప్రియుడికి ముద్దు పెట్టి చంపింది. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని జాషు బ్రౌన్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ప్రేమించుకుంటున్నారు. కాగా ఓ కేసులో ప్రియుడు జాషు బ్రౌన్ టేనస్సీ జైలులోని శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే చాలా రోజుల నుంచి ప్రియుడిని చూడని ఆ ప్రియురాలు ఇటీవల తనని కలిసేందుకని జైలుకి వెళ్లింది. వెళ్లడమే కాకుండా ప్రియుడితో కలిసి చాలా సేపు మాట్లాడింది. ఈ క్రమంలోనే ప్రియురాలు తన ప్రియుడికి గాఢమైన లిక్ లాక్ తో ముద్దు పెట్టింది. ముద్దు రూపంలో తనపై ఉన్న ప్రేమను నా ప్రియురాలు వ్యక్త పరుస్తుందని ప్రియుడు సంబరపడి సంతోషించాడు.
ఇక తన ప్రియుడిని కలి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కొద్దిసేపటికి ప్రియుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఏం జరిగిందని పోలీసులు ఆరా తీయగా.. ఒక్కసారిగా దిమ్మతిరిగే విషయం వెలుగులోకి వచ్చింది. ముద్దు పెట్టే క్రమంలో ప్రియురాలు మెథాఫెంటమైన్ అనే విషపూరిత 14 గ్రాముల డ్రగ్ తన పెదవులకు రాసుకుందని, ఆ తర్వాత ప్రియుడికి ముద్దు క్రమంలో అతని నోట్లోకి ఆ డ్రగ్ పంపించిందని పోలీసులు నిగ్గు తేల్చారు. ఇక ఈ కారణంగానే ఆమె ప్రియుడు మరణించాడని పోలీసులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియురాలిని అరెస్ట్ చేశారు. అసలు ప్రియుడిని చంపడానికి కారణం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.