ల్యాబ్‌కు వచ్చే ప్రతి శవానికి సంబంధించిన అవయవాలను స్కాట అమ్ముతూ వచ్చింది. అలా కోట్ల రూపాయలు సంపాదించింది. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కింది.
డబ్బు సంపాదించటానికి ఏ పని చేయడానికైనా కొందరు వెనుకాడటం లేదు. ఆడ,మగ అన్న తేడా లేకుండా కొందరు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. సభ్య సమాజం తల దించుకునేలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ శవాలనుంచి అవయవాలను దోచి అమ్మటం మొదలుపెట్టింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమెరికాలోని అర్కాన్సాస్ చెందిన చాంపిమన్ స్కాట్(36) అనే మహిళ అక్కడి యూనివర్సిటీ అనాటమా ల్యాబ్‌లో పని చేస్తోంది.
యూనివర్సిటీకి వచ్చిన శవాలను వివిధ రకాల స్ప్రేలు చేసి భద్రపరచడం, మృతదేహాలను రవాణా చేయడం, వాటిని పూడ్చి పెట్టడడం ఆమె పని. అయితే అనుకోకుండా స్కాట్‌కు ఓ దుర్భుద్ధి పుట్టింది. తన పనిలో మెళకువలు తెలుసుకున్న స్కాట్ శవాల అవయవాలు అమ్మకం మొదలుపెట్టింది. పాలీ అనే వ్యక్తితో ఫేస్ బుక్‌లో పరిచయం పెంచుకుంది. అతడి ద్వారా శవాల అవయవాలను అమ్మటం మొదలుపెట్టింది. మొదట గుండె, రెండు మానవ మెదడులను అమ్మింది. ఇక అప్పటినుంచి 9 నెలలుగా ల్యాబ్‌కు వచ్చిన శవాల అవయవాలను అమ్మడం స్టార్ట్ చేసింది.
ప్రతి అవయవాన్ని బాక్సులలో పెట్టి.. ఆన్ లైన్ ద్వారా పాలీకి అమ్మేది. అవయవాల అమ్మకం విషయం 2022 జూన్ లో పోలీసులకు తెలిసింది. పక్కా ప్లాన్‌తో ఆమెను జులైలో అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పాలీని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో నిల్వ చేసిన మానవ అవయవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను మే2 కి వాయిదా వేసింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.