పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు నాగభూషణం. వయసు 30 ఏళ్లు. గత మూడు రోజుల కిందటే ఇతడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి బంధువులంతా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక పెద్దలు నిశ్చయించిన పెళ్లి కావడంతో ఇరు బంధువులు సంతోషంగా పెళ్లి జరిపించారు. కట్ చేస్తే పెళ్లై మూడు రోజులు కాలేదు.. వరుడు గ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అల్లూరు సీతారామరాజు జిల్లా రాజావొమ్మంగి మండలం బోర్నగూడెం. ఇక్కడే నాగభూషణం అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 17న సింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని నాగభూషణం పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు కుదుర్చిన పెళ్లి కావడంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, నాగభుషణం సోమవారం ఉదయం బయటకు వెళ్లొస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఇక వెళ్తూ వెళ్తూనే ఊళ్లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు షాక్ కు గురయ్యారు. అనంతరం ఈ విషయాన్ని నాగభూషణం తల్లిదండ్రులకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లై మూడు రోజుల కూడా కాలేదు.. అంతలోనే నూతన వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అయితే పెళ్లై మూడు రోజులు కాకముందే వరుడు ఆత్మహత్య చేసుకోవడంపై మీరేలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.