అమ్మాయి చూడటానికి కుందనపు బొమ్మలా అనిపించడంతో తొలి చూపులోనే ఓకే చెప్పేశాడు వరుడు. అయితే తనకు తల్లిదండ్రులు లేరని పెళ్లి కుమార్తె చెప్పింది. అయితే ఆమె బంధువులు అక్షయ తృతీయ రోజు పెళ్లి చేసుకోవాలని ముహర్తం ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి కొడుకు వెనక్కు తగ్గలేదు. అయితే..
39 ఏళ్లు వచ్చినా కుమారుడికి పెళ్లి కాకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు. కుమారుడికి నచ్చిన అమ్మాయి దొరక్కపోవడంతో.. సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఇంతలో ఓ మధ్యవర్తి వచ్చి ఓ సంబంధాన్ని తీసుకువచ్చాడు. అమ్మాయి చూడటానికి కుందనపు బొమ్మలా అనిపించడంతో తొలి చూపులోనే ఓకే చెప్పేశాడు. అయితే తనకు తల్లిదండ్రులు లేరని అమ్మాయి చెప్పింది. అయితే ఆమె బంధువులు అక్షయ తృతీయ రోజు పెళ్లి చేసుకోవాలని ముహర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటికే పెళ్లి ఆలస్యమైందని భావించిన వరుడు. అంతసేపు ఆగలేనని చెప్పి కంగారుగా ఆమెను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఖంగు తినాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నాడు.
పెళ్లైన మూడు రోజులకే పెళ్లి కూతురు.. మొత్తం దోచుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ నగర్ జిల్లాకు చెందిన అనిల్ భార్గవ్.. కమలేశ్ అనే మధ్యవర్తి ద్వారా ఆర్తీ సాహును చూసేందుకు పెళ్లి చూపులకు వెళ్లాడు. తొలి చూపులోనే నచ్చడంతో ఆమెతో పెళ్లికి రెడీ అయ్యాడు. అయితే పెళ్లికి కొంచెం టైం కోరింది మహిళ. అప్పటి వరకు అత్తారింట్లో పనులు నేర్చుకుంటుందని సముదాయించేందుకు ప్రయత్నించారు పెద్దలు. అయితే అనిల్ ఒప్పుకోలేదు. పెళ్లి కాకుండా అమ్మాయిని తీసుకెళితే.. ఎన్నో రకాలుగా అనుకుంటారని భావించి.. వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు.
ఈ పెళ్లికి వరుడు కుటుంబం మాత్రమే హాజరైంది. ఆ తరువాత అనిల్ తన భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు. వరుడి ఇంట్లో కోలాహలంతో పాటు ఆమె చేసిన వంటలు మెచ్చుకుంటూ తిన్నారు. అయితే అందులో ఆమె మత్తు మందు కలిపిందన్న విషయం తెలియక లొట్టలేసుకుంటూ తినేశారు. ఆ రాత్రి అందరికీ గాఢ నిద్రపట్టేసింది. మర్నాడు పది గంటలకు గానీ వారికి మెళకువ రాలేదు. లేచాక చూస్తే ఇల్లు గుల్లయ్యింది. ఆ రాత్రి ఆమె ఇంట్లోని బంగారం తీసుకుని పారిపోయింది. రెండు లక్షల రూపాయల నగదు, బంగారు, వెండి ఆభరణాలతో వధువు అదృశ్యమైంది. తెల్లబోయి.. మోసపోయామని గుర్తించి.. పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు