ఆమె పేరు మమత. పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అనే మార్గాలు వెతికింది. దీని కోసం పక్కా ప్లాన్ తో ముందుగా ఓ గదిని అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత పేదరికంలో మగ్గుతున్న అందమైన మహిళలను ఏరికోరి పట్టుకుంది. అనంతరం ఆ పేద మహిళలకు డబ్బులు ఆశ చూపి పాడు పనులకు శ్రీకారం చుట్టింది. గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ మహిళ ఈ వ్యవహారాన్ని సాగిస్తూ వచ్చింది. ఇక అసలు విషయం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదిలాబాద్ జిల్లాలోని న్యూ హౌజింగ్ బోర్డు కాలనీలో మమత అనే మహిళ గత 15 రోజుల నుంచి నివాసం ఉంటుంది. ఇక డబ్బులు సులభంగా సంపాదించే మార్గాలను వెతికింది. ఈ క్రమంలోనే ఆమెకు వ్యభిచారం నిర్వహించాలనే ఆలోచన తట్టింది. ఇందు కోసం ఇక్కడే ఆ మహిళ ఓ గదిని అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత పేదరికంలో ఉన్న అందమైన మహిళలను మమత టార్గెట్ చేసింది. ఇక ఇందులో భాగంగానే మమత ఆ మహిళలకు డబ్బు ఆశ చూపి వ్యభిచారం రొంపిలోకి దింపేస్తుంది. ఇలా గత 15 రోజుల నుంచి అనేకమంది మహిళలను తన గదిలోకి రప్పించుకుని విటులతో వ్యభిచారాన్ని సాగించింది.
ఈ వ్యవహారాన్ని తొందరగా స్థానికులు పసిగట్టి గమనించారు. ఎలాగైన ఈ గుట్టును రట్టు చేయాలనుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మమత సాగిస్తున్న వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరి మహిళలతో పాటు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న వ్యభిచార నిర్వాహకురాలు మమత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.