రంగారెడ్డి జిల్లా, ఆదిభట్లలో డెంటిస్ట్ కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మిస్టర్ టీ ఫౌండర్.. నవీన్ రెడ్డి.. శుక్రవారం మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే.. సుమారు 100 మందితో కలిసి.. యువతి ఇంట్లోకి చొరబడి.. దాడి చేసి.. ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశాడు. ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. 6 గంటల్లోనే కేసు చేధించి.. వైశాలిని కాపాడారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెని గుర్తించిన పోలీసులు.. ఏపీ తెలంగాణ బోర్డర్‌లో ఉందని తెలుసుకుని.. అక్కడకు చేరుకుని.. యువతిని సురక్షింతగా తీసుకువచ్చారు. నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీపులు కిడ్నాప్‌కు పాల్పడిన మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డితో పాటు.. అతడికి సహకరించిన మరో 8 మందిని అరెస్టు చేశారు. వైశాలి కుటుంబ సభ్యులపై దాడి, ఆస్తుల ధ్వంసం చేయడంతో.. నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి.. పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. వైశాలికి, తనకు ఏడాది క్రితమే వివాహం జరిగిందని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. 2021 ఆగస్ట్‌లో తమకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిందని ఈ సందర్భంగా నవీన్ రెడ్డి చెప్పాడు. 2021 ఆగస్ట్ 4న బాపట్ల జిల్లా వలపర్ల ఆలయంలో తమ వివాహం జరిగిందని వెల్లడించాడు నవీన్ రెడ్డి.
అయితే బీడీఎస్ పూర్తయ్యే దాక పెళ్లి ఫొటోలను బయటకు రానీయవద్దని వైశాలి కండీషన్ పెట్టిందని.. నవీన్ రెడ్డి.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు. అందుకే తాను ఫోటోలను లీక్ చేయలేదని తెలిపాడు. అంతేకాక వైశాలి తల్లితండ్రులు కూడా బీడీఎస్ పూర్తవగానే తామిద్దరికి పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఆ మాట తప్పారని ఆరోపించాడు. అంతేకాక.. వైశాలి కుటుంబ సభ్యులు తామిద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి.. తనతో డబ్బులు ఖర్చు పెట్టించారని ఈ సందర్భంగా ఆరోపించాడు.
అంతేకాక వైశాలి తల్లిదండ్రులు.. తన డబ్బుతో వైజాగ్, అరకు, వంజంగి, మంగుళూరు, కూర్గ్, గోవా, గోకర్ణా వెళ్లారని వెల్లడించాడు. తాను వైశాలి పేరు మీద ఖరీదైన వోల్వో కారు.. ఆమె తండ్రి దామోదర్ రెడ్డి పేరు మీద రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నవీన్ రెడ్డి వెల్లడించాడు. కానీ వైశాలి తల్లిదండ్రులు మాత్రం.. నవీన్ రెడ్డి తమ కుమార్తెను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.