గాలి కోసం కిటికీలు తెరిచినప్పుడు గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది. అలానే ఎంత మంచి కాజ్ కోసం టెక్నాలజీని కనిపెట్టినా.. ఏదో ఒక లూప్ హోల్ ని వెతుక్కుంటూ చెడు అనేది వస్తుంది. టెక్నాలజీని అందరూ మంచిగా వాడుకుంటే.. కొందరు సైబర్ మోసగాళ్లు మాత్రం జనాన్ని ముంచడానికి వాడుతున్నారు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే స్కెచ్చులు, రెక్కీలు, నానా తంటాలు పడేవారు దొంగలు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంట్లో కూర్చుని బటన్ నొక్కుడు, ఇతరుల ఖాతాల నుండి డబ్బులు నొక్కుడు అన్నట్టు అయిపోయింది వ్యవహారం.
సావదాన్ ఇండియా, క్రైమ్ పెట్రోల్ వంటి అవేర్ నెస్ కలిగిన షోస్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ముంబై నటి ‘అమన్ సంధు’ను ఓ సైబర్ ఫ్రాడ్ మోసం చేశాడు. గుర్గాన్ నివాసి అయిన అమన్ సంధు.. జూలై 6వ తేదీన తన తల్లికి అపాయింట్మెంట్ కోసం జుహూకి చెందిన హాస్పిటల్ వెబ్సైట్ కోసం వెతికిందట. ఆ సమయంలో అధికారిక వెబ్సైట్ అనుకుని ఒక వెబ్సైట్ లో తన నెంబర్ నమోదు చేసిందట. ఆ నంబర్ తో ఓ పర్సన్ కాంటాక్ట్ అయ్యి హాస్పిటల్ సిబ్బందిగా పరిచయం చేసుకున్నాడు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఒక లింక్ ను షేర్ చేస్తూ రూ. 5 వేలు చెల్లించాలని అడిగాడు సదరు మోసగాడు. దానికి ఆమె ఆ లింక్ పై క్లిక్ చేయగా.. ఆమె ఖాతా నుండి రూ. 5 వేలు డెబిట్ అయ్యాయి. కాసేపటి తర్వాత ఆమె మూడు బ్యాంకు ఖాతాల నుండి 2 లక్షల 24 వేలు డెబిట్ అయ్యాయి.
దీంతో ఆమె ఓషివారా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే స్పందించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ను సంప్రదించి.. ఆమె ఖాతా నుండి బదిలీ చేయబడిన UPI రిఫరెన్స్ నంబర్ తెలుసుకున్నారు. ఆ తర్వాత మెయిల్ ద్వారా ఖాతాను బ్లాక్ చేయించి.. మనీ రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నటి అమన్ సంధు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
సాధారణంగా ఆన్ లైన్ మోసాలకు పాల్పడిన వారి సొమ్ము రికవరీ అవ్వడం అనేది చాలా రేర్. అలాంటిది ఈ నటి విషయంలో మాత్రం మొత్తం సొమ్మును రికవరీ చేసి శభాష్ అనిపించుకున్నారు పోలీసులు. మరి అమన్ సంధు కేసుని పోలీసులు సాల్వ్ చేసిన తీరుపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో చేయండి.
ఇది కూడా చదవండి: నా వల్ల కావడం లేదు.. కంటతడి పెట్టిస్తున్న యువతి మరణం!
ఇది కూడా చదవండి: పెళ్లికి నిరాకరించిన యువతి.. స్నేహితులతో కలిసి యువకుడు అత్యాచారం!