పెళ్లి మండపంలోని వారంతా ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. ఒళ్లంతా మండుతోందని అరుస్తూ ఉన్నారు. వీరి అరుపులు విన్న అక్కడి వారు ఏం జరిగిందో అర్థంకాక అల్లాడిపోయారు.
పెళ్లి వేడుక కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ డెకరేషన్‌లో అంత రాత్రి పూట కూడా ఆ ప్రాంతం వెలుగులీనుతోంది. పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు పెళ్లి పీటలపై కూర్చుని ఉన్నారు. పంతులు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు, ఇతరులతో ఆ ప్రాంతం ఎంతో సందడిగా ఉంది. ఈ నేపథ్యంలోనే కరెంట్ పోయింది. ఆ చీకట్లో అనుకోని ఘోరం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు పీటలపై కూర్చుని ఉన్న పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురుతో పాటు మిగిలిన వారిపై యాసిడ్ దాడి చేశారు. దీంతో పెళ్లి మండపంలో ఆహాకారాలు మొదలయ్యాయి.
ఈ ఘోర సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీష్‌ఘర్‌లోని చోటే అమబాల్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లి కుమారుడు ధమ్‌రుదార్ భాగేల్.. పెళ్లి కూతురు సునీత కశ్యప్‌లు పీటలపై కూర్చుని ఉన్నారు. వీరి చుట్టూ బంధుమిత్రులు కూర్చుని ఉన్నారు. పంతులు మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఉన్నట్టుండి కరెంట్ పోయింది. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురితో పాటు వారి చుట్టూ ఉన్న వారంతా కేకలు వేయటం మొదలుపెట్టారు.
ఏం జరిగింది.. ఎందుకు వాళ్లు అలా అరుస్తున్నారు అన్నది ఎవరికీ అర్థం కాలేదు. అరుస్తున్న వారిని విచారించగా తమపై ఎవరో.. ఏదో పోశారని. ఒళ్లంతా మండుతోందని చెప్పారు. దీంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారిపై యాసిడ్ లాంటి ద్రవంతో దాడి జరిగిందని తేలింది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 12 మందికి గాయాలైనట్లు తెలిపారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.