బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. యువతి- హసన్ పాత్రలపై కూడా పోలీసులు విచారణ చేశారు. వాట్సాప్ డేటాని రికవర్ చేయగా పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.
బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. పోలీసుల రిమాండ్ లో ఉన్న హరిహర కృష్ణ కీలక విషయాలు వెల్లడించాడు. ప్రియురాలి కోసమే తాను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత నిహారికా రెడ్డి- హసన్ పాత్రలపై కూడా పోలీసులు విచారణ చేశారు. వాట్సాప్ డేటాని రికవర్ చేయగా పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఈ కేసుకు సంబంధించి హసన్, హరి ప్రియురాలిని నిందితులుగా చేర్చారు. ఏ2గా హసన్ ని, ఏ3గా నిహారికను చేర్చి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో: హరి ప్రియురాలు భయం భయంగా ఆస్పత్రిలోకి ఎలా వెళ్తుందో చూడండి!కేసుకు సంబంధించి ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ కీలక విషాలు వెల్లడించారు. హత్య జరిగిన విషయం తెలిసి కూడా హసన్- ఆ యువతి పోలీసులకు వెల్లడించలేదనే విషయంపై వారిని అరెస్టు చేశారు.
“నవీన్ ని హరిహర కృష్ణ హత్య చేయబోతున్న విషయం హసన్ కి గానీ, యువతికి గానీ తెలియదు. హత్య చేసిన తర్వాత హసన్ కు విషయం చెప్పాడు. హత్య చేసిన విషయం తెలిసిన తర్వాత కూడా హరిహర కృష్ణకు హసన్ సహాయం చేశాడు. నవీన్ శరీర భాగాలు డిస్పోస్ చేసేందుకు హసన్ హెల్ప్ చేశాడు. 17వ తారీఖు రాత్రి హసన్ ఇంట్లోనే హరిహర కృష్ణ రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత 18వ తారీఖు యువతిని కలిసి నవీన్ హత్య చేసిన విషయం చెప్పాడు. ఆ తర్వాత అతను నిహారిక వద్ద రూ.1500 తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వారితో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నాడు. యువతి వారి సంభాషణలు డిలీట్ చేసి ఆదారాలు ట్యాంపరింగ్ చేసింది. సమాచారం తెలిసి కూడా పోలీసులకు చెప్పని కారణంగానే వీళ్లను రిమాండ్ లోకి తీసుకున్నాం” అంటూ డీసీపీ వివరించారు.
ఘటనాస్థిలికి వెళ్లి ఆ యువతి నవీన్ మృతదేహాన్ని కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. హసన్ కూడా హరిహర కృష్ణకు సహాయం చేశాడనే విషయాన్ని నిర్ధారించారు. హత్య చేస్తాడనే సమాచారం లేకపోయినా.. చేసిన తర్వాత వాళ్లు కావాలనే సమాచారాన్ని దాచిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయానికి సంబంధించే హసన్, యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యూడీషియరీ రిమాండు కోరేందుకు హసన్, యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో పోలీసుల జీపు నుంచి బయటకు దిగి నిహారిక భయం భయంగా ఆస్పత్రిలోకి వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.