ప్రేమించిన యువతి తనకు దక్కదనే అక్కసు, అనుమానంతో.. స్నేహితుడిని నమ్మించి.. అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోటు చేసుకుంది. రోజులు గడుస్తోన్న కొద్ది.. ఈ కేసులో యువతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె ప్రోద్భలంతోనే హరి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ దారుణంలో ఆ యువతి పాత్ర ఎంత వరకు ఉంది అంటే..
అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్ విద్యార్థి నవీన్ దారుణ హత్యతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. పట్టుమని 20 ఏళ్లు లేని యువకుడు.. ఓ అమ్మాయి కోసం.. స్నేహితుడిని నమ్మించి అత్యంత దారుణంగా హత్య చేసిన తీరు చూసి పోలీసులే భయపడ్డారు. ఈ దారుణానికి ప్రధాన కారణం ఓ అమ్మాయిగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తోన్న పేర్లు నిందితుడు హరిహరకృష్ణ, మృతుడు నవీన్, వీరిద్దరి స్నేహితురాలిగా చెప్పబడుతున్న యువతి. నవీన్ స్నేహితులు, అతడు సోదరుడు చెప్పిన దాని ప్రకారం.. వీరి ముగ్గురికి ఇంటర్ నుంచే పరిచయం ఉంది. నవీన్, యువతి, హరిహరకృష్ణ ముగ్గురు స్నేహితులు. ఈ క్రమంలో నవీన్-యువతి మధ్య ఏడాది పాటు లవ్ ట్రాక్ కొనసాగింది. ఆ తర్వాత వారి మధ్య గొడవలు వచ్చి.. విడిపోయారు. ఆ తర్వత యువతి.. హరిహరకృష్ణకు దగ్గరయ్యింది.
యువతి, హరి మధ్య రిలేషన్ కొనసాగుతుండగా.. నవీన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో సదరు యువతి ఇటు హరి, నవీన్ ఇద్దరితో మాట్లాడుతూ.. ఉంది. ఇక నవీన్ సోదరుడు చెప్పిన దాని ప్రకారం.. యువతిని దూరం పెట్టినా సరే.. ఆమె పదే పదే తన అన్నకు కాల్ చేయడం, ఫోన్ చేయడం చేసేదని వెల్లడించాడు. కానీ తన సోదరుడు ఆమెను దూరం పెట్టడంతోనే.. హరితో కలిసి ఇంత దారుణానికి పాల్పడిందని.. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు. హరి తండ్రితో పాటు నవీన్ కుటుంబ సభ్యులు కూడా యువతి, హరి కలిసే ఈ దారుణానికి పాల్పడ్డారని.. ఆమెను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక నవీన్‌ని హత్య చేసిన తర్వాత హరి.. అతడి శరీర భాగాలను ఒక్కొక్కటిగా వేరు చేసి.. వాటిని నిహారికకు వాట్సాప్ చేశాడు. వాటిని చూసిన యువతి సింపుల్‌గా ఓకే, గుడ్ బాయ్ అని రిప్లై ఇవ్వడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇక నవీన్‌ను హత్య చేసిన విషయం హరి ముగ్గురికి చెప్పాడు. వారిలో యువతి కూడా ఉంది. ఈ దారుణం గురించి తెలిసి కూడా ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సరికదా.. నవీన్ స్నేహితుడు కాల్ చేసినప్పుడు ఎంతో కూల్‌గా.. తనకేం తెలియదన్నట్లు మాట్లాడిన తీరు పోలీసులను ఆశ్చర్యపరిచింది. ఇంత దారుణం గురించి తెలిసి.. అంత ధైర్యంగా ఎలా ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
తన కుమారుడు సదరు యువతి ప్రోద్భలంతోనే ఈ దారుణానికి ఒడి గట్టాడు అని.. ఆమెను కూడా శిక్షించాలని హరి తండ్రి పోలీసులను కోరుతున్నాడు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు యువతి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఏకంగా పోలీసులను బెదిరిస్తోంది. తనను ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే తీరు కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు మొత్తం ఈ క్రైమ్ కథా చిత్రంలో సదరు యువితిదే ప్రధాన పాత్రగా తెలుస్తోంది. మరి ఈ కేసులో ఆమెకు శిక్ష పడే అవకాశం ఉందా.. లేదా అంటే..
అందుకు అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాల్లో.. యువతికి నవీన్ హత్య గురించి తెలిసి కూడా పోలీసులకు చెప్పలేదు. అంటే నిందితుడిని కాపాడే ప్రయత్నం చేసింది.. లేదంటే నేరం గురించి చెప్పకపోవడం మాత్రమే యువతిపై ఉన్న ప్రధాన అభియోగం అవుతుంది. ఇక ఈ కేసులో ఆమె ప్రమేయం ఎంత వరకు ఉంది.. నిజంగానే అందరూ చెబుతున్నట్లు ఆమె ప్రోద్భలంతోనే హరి.. నవీన్‌ను హత్య చేశాడా లేదా అన్నది యువతి-హరి మధ్య జరిగిన ఫోన్ కాల్స్, వాట్సాప్ చాట్‌లో బయటపడుతుంది.
ప్రస్తుతం పోలీసులు డేటాని రీట్రీవ్ చేసే పనిలో ఉన్నారు. హరి, యువతి మధ్య జరిగిన పూర్తి సంభాషణ బయటకు వస్తే.. ఈకేసులో ఆమె పాత్ర ఎంత వరకు ఉన్నది అన్నది తేలుతుంది. ఆ ప్రకారం ఆమెకు శిక్ష పడే అవకాశం ఉందా లేదా అన్నది తెలుస్తుంది అంటున్నారు నిపుణులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.