ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఈ యువతి సంగారెడ్డి జిల్లాలోని కంది ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఈ అమ్మాయి ఇళ్లల్లో పని చేసుకుంటూ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చింది. ఎన్నో కష్టాలు పడుతూ పొట్టకూటి కోసం చెమటోడ్చి పని చేసింది. ఇదిలా ఉంటే ఆ యువతి గత కొంత కాలంగా డబుల్ బెడ్ రూం ఇంట్లో నివాసం ఉంటుంది. ఆ యువతితో పాటు పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆ యువతి ఇళ్లల్లో పని చేస్తూనే ఊహించని నిర్ణయం తీసుకుంది. 19 ఏళ్ల వయసు ఉన్న ఈ అమ్మాయి ఇలా చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఆ యువతి ఏం చేసింది? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. పైన ఫొటోలో కనిపిస్తున్నయువతి పేరు ధర్మిన్ పాటిల్. వయసు 19 ఏళ్లు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మాయి సంగారెడ్డి జిల్లాలోని కంది ప్రాంతంలో ఇళ్లల్లో పని చేసుకుంటూ డబుల్ బెడ్ రూం ఇంట్లో నివాసం ఉండేది. ఇదిలా ఉంటే.. ధర్మిన్ పాటిల్ ఈ నెల 13న రాత్రి సమయంలో బయటకు వెళ్లింది. చాలా సేపు అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. కానీ, ఆమె జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎవరికైనా ఈ యువతి ఆచూకి తెలిస్తే వెంటనే 8712656746 నెంబర్ కు సమాచారాన్ని ఇవ్వాలంటూ పోలీసులు కోరారు.