పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి నగరంలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. రోజూ కాలేజీకి వెళ్తూ తిరిగి వస్తుండేది. అయితే శ్రావణి ఎప్పటిలాగే ఈ నెల 3న బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
శ్రావణి హైదరాబాద్ లోని ఓ కాలేజీలో ఎంబీఏ స్టూడెంట్. రోజూ కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేది. గొప్పగా చదువుకుని ఎప్పటికైనా మంచి హోదాల్లో స్థిరపడాలని కలలు కనేది. అందుకోసం బాగానే చదివేది. తల్లిదండ్రులకు కూడా కూతురుపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆ యువతి గురువారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. ఎప్పటిలాగే కూతురు ఇంటికి వస్తుందని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ, ఆ యువతి ఏం చేసిందో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బాలాజీ నగర్ లోని మోహన్ రావు కాలనీలో దేవరాయ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రావణి (22) అనే కూతురు ఉంది. ఆ యువతి ఈసీఐఎల్ లోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. బాగా చదివి ఎప్పటికైనా మంచి హోదాలో స్థిరపడాలని అనుకునేది. కూతురిపై తల్లిదండ్రులకు కూడా బాగా నమ్మకం. అయితే ఈ నెల 3న శ్రావణి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి ఫోన్ చేశారు. అయినా స్పందించలేదు. బంధువుల ఇంటికి ఫోన్ చేసి కూతురి జాడ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా కూడా శ్రావణి ఆచూకి లభించలేదు. ఇక చేసేదేం లేక శ్రావణి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి కూతురు కనిపించకుండాపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.