ప్రపంచ వ్యాప్తంగా అపర కుబేరుడిగా పేరు గాంచిన వ్యక్తి ముఖేష్ అంబాని. ఆయన సంపాద రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ప్రపంచ స్థాయి కుబేరులతో పోటీ పడుతున్న ముఖేష్ అంబాని తన సంపదను రోజు రోజుకు రెట్టింపును చేసుకుంటున్నాడు. దీనిని పక్కనబెడితే. గత కొన్నేళ్ల నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి.. ముఖేష్ అంబాని, అతని కుటుంబ సభ్యులను బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలసింది.
అయితే తాజాగా కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి పదే పదే ఫోన్ చేసి.. ముఖేష్ అంబాని, అతని కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇదే కాకుండా అతని ఇంటిని పేల్చేమని కూడా ఫోన్ లో వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో అలెర్ట్ అయిన ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్ డేటా ఆధారంగా 24 గంటల్లోనే ఫోన్ చేసి బెదిరించిన యువకుడిని పట్టుకున్నారు.
బీహార్ కు చెందిన రాజేష్ మిశ్రా (30) అనే యువకుడే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. అయితే గత కొన్నిరోజుల నుంచి నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ, మానసికంగా క్రుంగిపోయాడట. అనంతరం ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని జైలుకి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముఖేష్ అంబాని ఇంటి వద్ద భద్రత సిబ్బందిని పెంచారు. తాజాగా చోటు చేసుకున్న ఈ బెదిరింపు ఫోన్ కాల్ రికార్డ్ తీవ్ర కలకలంగా మారుతోంది.