దేశ రక్షణ శాఖకు చెందని ఓ యువకుడు హనీట్రాప్ లో చిక్కుకున్నాడు. అమ్మాయిల అందానికి ఫిదా అయి ఏకంగా దేశానికే నమ్మక ద్రోహం చేశాడు. అసలేం జరిగిందంటే?
రవిమీనా అనే యువకుడు ఢిల్లీలో ఉన్న రక్షణ శాఖలో పని చేస్తున్నాడు. అయితే ఇతడికి గత కొంత కాలం నుంచి ఫేస్ బుక్ ద్వారా ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. ఆ అమ్మాయిలు అందాలు అరబోసి ఆ యువకుడిని హనీట్రాప్ లోకి దింపారు. వారి సొగసులకు ఫిదా అయిన ఆ యువకుడు.. ఏకంగా దేశానికి ద్రోహం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది. అసలు ఆ అమ్మాయిలు ఎవరు? రవిమీనా దేశానికి చేసిన ద్రోహం ఏంటి? అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ కు చెందిన రవిమీనా అనే యువకుడు ఢిల్లీలోని సేనా భవన్ లో పని చేస్తున్నాడు. ఇతడు 2015 నుంచి రక్షణ శాఖలోనే పని చేస్తున్నాడు. అయితే ఇతనికి గతంలో ఫేస్ బుక్ ద్వారా పాకిస్తాన్ గూడఛార సంస్థ ISIకి చెందిన ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు. ఇండియాకు చెందిన అమ్మాయిలే అనుకుని రవిమీనా వారితో చాట్ చేశాడు. ఆ అమ్మాయిలు కూడా అతనికి చాట్ంగ్ చేస్తూ తమ అందాలతో ఆ యువకుడిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఆ రవిమీనానే కాకుండా మరో ఐదుగురు యువకులు హనీట్రాప్ లో చిక్కుకున్నారు. ఇక ఆ అమ్మాయిల మీద అనుమానం రావడంతో కొన్నాళ్ల తర్వాత ఆ ఐదుగురు యువకులు వారి నుంచి బయట పడగలిగారు. కానీ, రవిమీనా మాత్రం వారితోనే చాటింగ్ చేస్తూనే కొనసాగాడు.
అయితే రవిమీనా ఆ ఇద్దరు అమ్మాయిలు ISIకి చెందిన వారని మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలు.. రవిమీనా ద్వారా సైనిక సీక్రెట్స్ అన్నీ తెలుసుకోవడం మొదలు పెట్టారు. అలా ఆ యువకుడు దేశ రక్షణ సీక్రెట్స్ పత్రాలను ఒక్కొక్కటిగా ఫొటోలతో సహా వారికి పంపినట్లుగా తెలుస్తుంది. ఇక సేనా భవన్ అధికారులకు అనుమానం రావడంతో రవిమీనాను అరెస్ట్ చేసి విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు. అయితే పోలీసుల విచారణలో ఆ యువకుడు ISIకి చెందిన ఇద్దరు అమ్మాయిలకు ఏకంగా 40 పత్రాలను ఫొటోల ద్వారా పంపి దేశానికి ద్రోహం చేశాడని తెలుసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రవిమీనాను ఎలాంటి పత్రాలు పంపాడనే దానిపై విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. వలపు వలలో చిక్కుకుని దేశానికి ద్రోహం చేసిన రవిమీనా వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.