హైదరాబద్ లో ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో నిండామునిగిన ఘటన తాజాగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏకంగా రూ.29 లక్షలు వెచ్చించి రాజస్థాన్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. అయితే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని ఓ యువకుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూస్తే అమ్మాయి పేరుతో రిక్వస్ట్ వచ్చింది. దీంతో ఆశపడిన యువకుడు రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత న్యూడ్ కాల్ చేయి అంటూ మెసెజ్.. మనోడు రెచ్చిపోయి వెంటనే అలాగే చేశాడు.
అటు నుంచి కూడా అమ్మాయి న్యూడ్ కాల్ వచ్చింది. ఇది రికార్డెడ్ కాల్ అని మనోడు గుర్తించలేకపోయాడు. అలా ఆ యువకుడు తన న్యూడ్ కాల్ ను సదరు సైబర్ నేరగాళ్లు రికార్డ్ చేశారు. వెంటనే కొందరు వ్యక్తులు ఆ యువకుడికి ఫోన్ చేసి.. నేను ఢిల్లీ నుంచి ఏసీపీని మాట్లాడుతున్నానని.. ఇందాక నీతో న్యూడ్ కాల్ మాట్లాడిన యువతి ఆత్మహత్య చేసుకుందని, నీపై కేసు నమోదైందని ఫోన్ లో తెలిపారు. దీంతో మనోడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనంటూ తెలిపారు. దీంతో భయపడి పోయిన ఆ యువకుడు వారు అడిగినప్పుడల్లా దాదాపుగా రూ. 29 లక్షలు వెచ్చించాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ యువకుడు ఇటీవల సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు రాజస్థాన్ సైబర్ నేరగాళ్ల పనేనంటూ నిగ్గుతేల్చారు.