సాధారణంగా ఎవరైన ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకుంటే తీసుకున్న వ్యక్తితో గొడవకు దిగుతారు. అయినా అతడు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుంటే అతని వద్ద విలువైన వస్తువులు ఎలాంటివి ఉన్నా వాటిని తెచ్చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ యువకుడు మాత్రం రూ.10 కోసం ఏకంగా తన ప్రాణ స్నేహితుడిని బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? కేవలం రూ. 10 కోసమే తన స్నేహితుడిని హత్య చేశాడా? లేక దాని వెనకాల ఏమైన బలమైన కారణం దాగి ఉందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఉత్తర పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ప్రాంతం. ఇక్కడే సుబ్రతా దాస్ (22), అజయ్ రాయ్ (22), రాంప్రసాద్ సాహా (20), అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి ముగ్గురు కలిసి ఉండేవారు. కానీ ఈ యువకులు గత కొంత కాలం నుంచి డ్రగ్స్ కు అలవాటు పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు స్నేహితులు కలిసి సోమవారం డ్రగ్స్ సేవించేందుకు ఓ అడవిలో వెళ్లారు. అక్కడికి వెళ్లాక ముగ్గురు కలిసి డ్రగ్స్ సేవించారు. అందరూ మత్తులోకి జారుకున్నారు. అయితే ఈ సమయంలోనే అజయ్.. సుబ్రతా దాస్ ని డ్రగ్స్ కు రూ.10 కావాలని అడిగాడు. ఇక అజయ్ వద్ద లేకపోవడంతో నిరాకరించాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన సుబ్రతా దాస్ అజయ్ రాయ్ ని బండరాయితో తలపై బలంగా దాడి చేశాడు. ఈ దాడిలో అజయ్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఇదే విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు అజయ్ చనిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. రూ.10 కోసం ప్రాణ స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.