నోరులేని జీవాలపై కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయి విర్రవీగుతున్నారు. ఇటీవల ఓ మేకపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన మరవకముందే మరో నోరులేని ఆవుపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన రావుల సాయన్న అనే రైతు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇక ఇంట్లో మార్బుల్ వేసేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరి కూలీలను రప్పించారు.
ఇది కూడా చదవండి: గర్భంతో ఉన్న మేకపై ముగ్గురు వ్యక్తుల దారుణం!
వీరిలో విజయ్ అనే యువకుడు బుధవారం బాగా మద్యం సేవించాడు. ఇక అందరూ నిద్రించాక సాయన్నకు చెందిన ఆవును ఇంట్లో ఉన్న కిటికి కదలకుండా కట్టేసి ఆవుపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆవు తాడు తెంచుకునే క్రమంలో గొంతుకు ఉరిపడి అక్కడికక్కడే మరణించింది. ఇక ఇంట్లో ఆవు ఉరిపడి మరణించడంతో సాయన్నకు విజయ్ పై అనుమానం బలపడింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విజయ్ ని ప్రశ్నించగా ఆవుపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు. ఆవు రక్తపు నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని పోలీసులు తెలిపారు. ఇక నిందితుడు విజయ్ ని పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.