మద్యం మత్తులో యువకులు ఎంతకైన తెగిస్తున్నారు. అక్కా, చెల్లి అనే తేడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తూ చివరికి అత్యాచారాలకు కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఇక రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ మద్యం తాగుతూ కనిపించిన ఆడవాళ్లపై కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన కొందరు యువకులు అర్థరాత్రి ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతుంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ యువకులు భర్తే ముందే భార్యను ఎలా వేధించారనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ పరిధిలోని శాంతినగర్ కు చెందిన దంపతులు ఇటీవల బస్టాండ్ వద్ద నుంచి ఇంటికి వెళ్తున్నారు. వీరు వెళ్తున్న క్రమంలోనే ఈ దంపతులకు ఎదురుగా కారులో కొందరు యువకులు వచ్చారు. ఇక వస్తూ వస్తూనే ఆ దంపతులను రోడ్డుపైనే అడ్డుకున్నారు. అడ్డుకోవడమే కాకుండా భర్త ముందే అతని భార్యను అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇక ఆ మహిళపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ రెచ్చిపోయి ప్రవర్తించారు. దీనిని అడ్డుకున్న భర్తపై కూడా ఆ యువకులు దాడికి పాల్పడ్డారు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతోంది. అనంతరం ఈ ఘటనపై ఆ దంపతులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు.