రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు దుర్మార్గులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ప్రేమిస్తున్నానని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఏకంగా టీవీ యాంకర్ కు వేధింపులు గురి చేశాడు. ప్రేమిస్తున్నానని ఇన్నాళ్లు నమ్మించి తిరిగాడు. అలా రోజులు గడుస్తున్న కొద్ది ఆ యాంకర్ తో శారీర కోరికలు తీర్చాలని కోరాడు. దీనికి ఆ యాంకర్ నికాకరించడంతో.. నీ న్యూడ్ ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
హైదరాబాద్ లోని ఓ యువతి యాంకర్ గా పని చేస్తూ మధురానగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూకట్ పల్లికి చెందిన సామ్రాట్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని ఆ యువతి వెంటపడుతున్నాడు. రోజు కలవడం, ప్రేమించాలని వెంటపడడం చేస్తుండేవాడు. అలా ఆ యువతి వెంట తిరుగుతూనే ఆమెకు తెలియకుండా ఆ యువకుడు ఫొటోలు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆ యువకుడు ఆ యువతిని బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడికి వెళ్లాక ఆమెపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు.
దీంతో ఆ యువతి అతడి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరారైంది. ఇక అప్పటి నుంచి సామ్రాట్.. నా కోరిక తీర్చాలని, లేకుండా నీ న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఇక రోజు రోజు ఆ యువకుడి వేధింపులు ఎక్కువవడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఇక చేసేదేంలేక ఇటీవల ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.