ఏపీలోని ఓ జిల్లాకు చెందిన ఓ అందమైన మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. తన ప్రయాణంలో ఓ యువకుడిని పరిచయం చేసుకుంది. మహిళ కాస్త అందంగానే ఉండడంతో ఆ యువకుడు మనసులో ఏదేదో ఊహించుకున్నాడు. ఈ పరిచయంతోనే ఇద్దరు ఇంకాస్త దగ్గరయ్యారు. ఇంకేముంది.. ఆ మహిళ యువకుడిని లాడ్జికి వెళ్దామని కోరింది. కుర్రాడు.., పైగా వయసులో ఉన్నాడు కదా కాదనకుండా సరే అన్నాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి ఎంచక్కా లాడ్జిలో ఓ రూమ్ ను తీసుకుని అందులోకి వెళ్లిపోయారు. అనంతరం ఆ మహిళ చేసిన పనికి ఆ యువకుడికి ఒక్కసారిగా దిమ్మతిరిగింది. అసలు ఆ మహళ ఏం చేసింది? ఇంతకు లాడ్జిలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ, హైదరాబాద్ కు చెందని ఓ యువకుడు ఇద్దరు ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్నారు. పక్కసీటులో ఉన్న మహిళ ఆ యువకుడిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆమె విషయాలు ఆయనకు చెప్పడం, ఆయన విషయాలు ఆమెకు చెప్పుకున్నారు. అలా ఓ గంటపాటు వీరి ముచ్చట సాగింది. ఆ మహిళ ఎర్రగా, బుర్రగా ఉండడంతో మనోడు కాస్త కాలుజారాడు. ఆమె కూడా మనోడికి నెగిటివ్ పాయింట్ కనిపెట్టింది. అలా వీరి గంట పరిచయంతోనే ఇద్దరు చాలా దగ్గరయ్యారు. చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవారిలా మాట్లాడుకుంటున్నారు. ఇక ఇంకేముంది ఆ మహిళ ఆ యువకుడిని శ్రీకాళహస్తిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లింది.
అతడు కూడా కాదనకుండా సరేనంటూ ఆమె కొంగుపట్టుకుని వెళ్లాడు. ఇక అక్కడికి వెళ్లాక ఇద్దరు కలిసి ఓ రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లాక ఆ మహిళ కాస్త తెలివిగా ఆలోచించి అతని వద్ద ఉన్న ప్రసాదంలో ఆ మహిళ అతడికి తెలియకుండా మత్తు కలిపించి తినిపించింది. ఇక ఆ తర్వాత ఆ మహిళ చేయాల్సింది అంతా చేసేసింది. ఏం చేసిందో చేసిందనే కదా మీ ప్రశ్న. అతని వద్ద ఉన్న రూ.20 వేల నగదు, 7 తులాల బంగారం, ఓ ఫోన్, దోచుకెళ్లి అక్కడి నుంచి పరారైంది. అతడు మత్తులోంచి బయటకు వచ్చాకా.. జరిగిల్సింది జరగడంతో అతడికి దిమ్మతిరిగి బొమ్మ కనపించింది. ఇక చేసేదేం లేక ఆ యువకుడు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.