ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కన్నా ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని వారితో నైన సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. ఇక పెళ్లైన కొన్నాళ్లకే వివాహేతర సంబంధాలు అంటూ ప్రియుడికి హాయ్ చెప్పి భర్తకు బాయ్ చెబుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు వదిలేసి చివరికి ప్రియుడితో లేచిపోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అందుకు దారితీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలో ఐశ్వర్య అనే యువతి నివాసం ఉంటుంది. 3 నెలల కిందట ఐశ్వర్య ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇష్టపడి పెళ్లి చేసుకుంది కదా అన్ని ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా సర్దుకుపోయారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. ఇదిలా ఉంటే ఈ నెల 3న ఐశ్వర్య పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో భర్త రాజ్ కుమార్ బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు. ఇక సాయంత్రం అయినా కూతురు ఇంటికి రావకపోవడంతో ఐశ్వర్య తల్లిదండ్రులు భర్త రాజ్ కుమార్ కు ఫోన్ చేశారు. లేదు మీ ఇంటికి వచ్చిదంటూ రాజ్ కుమార్ వారితో గొడవ పడ్డాడు.
అనంతరం భార్య మా ఇంటికి రాలేదని అత్తమామలు చెప్పడంతో భర్త ఖంగుతిని.. నా భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య తల్లిదండ్రులు స్టేషన్ కు చేరుకుని మా కూతురుని రాజ్ కుమారే ఏదో చేశాడంటూ అతనితో గొడవకు దిగారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య ఫోన్ కాల్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల గాలింపు చర్యల్లో వారికి దిమ్మతిరిగే నిజం తెలిశాయి. అసలు విషయం ఏంటంటే? ఐశ్వర్య గతంలో తాను ఉద్యోగం చేసే సమయంలో నందిగామకు చెందిన పులగం రమేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయంతోనే ఐశ్వర్య అతడిని ప్రేమించింది. దీంతో ఇద్దరు కొన్నాళ్లపాటు ప్రేమ విహారంలో తేలియాడారు. అలా వీరి ప్రేమాయణం సాగుతున్న క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక కొంత కాలం తర్వాత ఐశ్వర్య రాజ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నాక ఈ దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు వచ్చి చేరాయి. ఇదే మంచి సమయం అనుకున్న ఐశ్వర్య తన మాజీ ప్రియుడు రమేష్ తో మళ్లీ ఫోన్ లో మాట్లాడుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 3న ఐశ్వర్య పుట్టింటికి వెళ్తానని భర్తకు చెప్పి ఏకంగా మాజీ ప్రియుడు రమేష్ తో లేచిపోయింది. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమించిన భర్తను, కన్న తల్లిదండ్రులను మోసం చేసి చివరికి మాజీ ప్రియుడితో లేచిపోయిన ఐశ్వర్య తీరు ఎంత వరకు కరెక్ట్? పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.