ఒక టీవీ సీరియల్ నింపిన క్రైమ్ స్పూర్తితో కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు.ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లిలో చోటు చేసుకుంది. మళవళ్లిలో ఎన్ఇఎస్ లేఅవుట్ లో నివాసం ఉంటున్న శశికుమార్ (30)ని అతని భార్య నాగమణి (28) ప్రియుడు హేమంత్ (25)తో కలిసి హతమార్చింది. కనకపురలో గార్మెంట్స్ దుకాణంలో పనిచేస్తున్న నాగమణికి హేమంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా అతన్ని ఇంటికి, బెడ్ రూమ్ కి తీసుకెళ్లేలా చేసింది. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం తెలిసిన భర్త.. భార్యను పలుమార్లు మందలించాడు. అయినా సరే మాట వినకపోవడంతో ఆమె వద్ద మొబైల్ ఫోన్ లాక్కుని, పనికి వెళ్ళొద్దని రెండు లాగి ఇంట్లో కూర్చోబెట్టాడు.
దీంతో కోపం కట్టలు తెచ్చుకున్న ఇల్లాలు భర్తను అడ్డుతప్పించాలనుకుంది. సరిగ్గా అదే సమయంలో టీవీలో ‘శాంతం పాపం’ అనే కన్నడ సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ లో మాదిరిగానే భర్త హత్యకు పక్కా స్కెచ్ వేసింది. ఆదివారం రాత్రి ప్రియుడు హేమంత్ ని ఇంటికి పిలిచింది. నిద్రపోతున్న పిల్లల చేతులూ, కాళ్ళు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత మద్యం మత్తులో నిద్రపోతున్న శశికుమార్ ని చున్నీతో గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత మహానటిలా అయ్యో నా మొగుడ్ని ఎవరో గుర్తుతెలియనోళ్లు వచ్చి చంపేశారమ్మా అంటూ సీరియల్ ఏడుపు మొదలుపెట్టింది. తన కొడుకు మృతిపై అనుమానం రావడంతో శశికుమార్ తల్లి తాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తమ స్టైల్లో విచారించగా నాగమణి, హేమంత్ లిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. సీరియల్ స్పూర్తితో ఈ హత్య చేశామని వెల్లడించారు. కాల గర్భంలో కొట్టుకుపోయే తాత్కాలిక సుఖాల కోసం కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భాగస్వామి చేసిన తప్పుకి వారి పిల్లలు ఆనాధలు అయిపోతున్నారు. ఇలాంటి వారి వల్లే కదా సమాజంలో నేరాల రేటు పెరిగిపోయేది. మరి ఈ ఇల్లాలు చేసిన పనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
ಕ್ರೈಂ ಧಾರಾವಾಹಿ ನೋಡಿ ಪತಿಯನ್ನ ಕೊಲೆ ಮಾಡಿ ಪತ್ನಿ#karnataka #malavalli #husband #wife #murder https://t.co/PzSviRGHYt
— Asianet Suvarna News (@AsianetNewsSN) September 21, 2022