పైన ఫొటోలో ఎర్రగా, బుర్రగా కనిపిస్తున్న మహిళ పేరు భవ్య. వయసు 32 ఏళ్లు. వేసుకున్న బట్టలు మార్చినట్టే కట్టుకున్న మొగుళ్లను కూడా మార్చడం ఆమెకు అలవాటు. అయితే గతంలో ఈమెకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి కావాలనే అతనితో గొడవ పడి విడిపోయి మరో వివాహం వివాహం చేసుకుంది. ఇక అతనితో కూడా గొడవ పడ్డ ఆ మహిళ రెండవ భర్తకు దూరంగా వెళ్లి చివరికి ముద్దుగా మూడో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే ఇటీవల ఈ మహిళ రెండవ భర్తతో అలా ఉండగా మూడో భర్త చూశాడు. దీనిని తట్టుకోలేకపోయిన మూడో మొగుడు ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. సినిమా స్టైల్ లో ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది ఢిల్లీలోని ఘజియాబాద్ లోని కాన్షిరాం కాలనీ. ఇక్కడే భవ్య (32) అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె అప్పట్లో బేబీగా పరిచయం చేసుకుని యోగేంద్ర కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనిని పెళ్లి చేసుకుని నాలుగు రోజులు కూడా సంసారం చేయలేదు. కావాలనే భర్తతో గొడవ పెట్టుకుని అతడికి టాటా చెప్పి అనీస్ అన్సారీ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఇతనితో ఆ మహిళ కొన్నేళ్ల పాటు బాగానే సంసారం చేసింది. కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే భవ్య రెండవ మొగుడితో కూడా ఇమడలేకపోయింది. దీంతో భర్తతో గొడవ పడి అతనితో విడిపోయింది. ఇదిలా ఉంటే గత 5 నెలల క్రితం భవ్య వినోద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఈ నాలుగు, ఐదు నెలలు భవ్య వినోద్ తో బాగానే కాపురం చేసింది. అయితే డిసెంబర్ 25న భవ్య తన రెండవ మొగుడైన అనీస్ అన్సారీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. భవ్య రెండవ భర్తతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా మూడో భర్త వినోద్ సడెన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇది చూసిన వినోద్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక కోపంతో తట్టుకోలేకపోయిన చివరి మొగుడు వినోద్ భార్య భవ్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భవ్య మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు మూడో భర్త వినోద్ ను విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం పోలీసులు నిందితుడు వినోద్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.