పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత తెలుసుకదా.. ఇక్కడ ఈ పెద్దాయన చేసిన పని అంతకన్నా ఘోరంగా ఉంది. బాధ్యతాయుత పదవిలో ఉంటూ.. ప్రజాప్రతినిధిగా, గ్రామ ప్రథమ పౌరుడిగా చేయాల్సిన పనులు కాకుండా పాడు పనులు చేస్తున్నాడు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తి ప్రజల ప్రాణాలు తీసే గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్‌గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
గురువారం పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సుర్పం భగవంత్‌రావు, ఈస్‌గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కారు ఉన్నారు. వారిని చూడగానే పోలీసులు షాక్ తిన్నారు. వారికి గతంలోనే సమాచారం ఉంది. వీరిద్దరూ గంజాయి విక్రయిస్తున్నారని. పక్కా సమాచారంతో మాటు వేసి పోలీసులు వారిని పట్టుకున్నారు. వారు ఈస్‌గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి రహస్య ప్రదేశం నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్ను గ్రామస్థులు సర్పంచ్‌కు ఇదేం పోయేకాలం.. ఇలాంటి పనులు చేస్తున్నాడంటూ చీవాట్లు పెడుతున్నారు.