రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో రెండు నెలల పాప కిడ్నాప్ కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ పాపను సురక్షితంగా రక్షించారు.
గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ మూడేళ్ల బాలుడిని ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. గమనించిన స్థానికులు ఆమె వద్ద ఉన్న ఆ బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన మరువకముందే తాజాగా హైదరాబాద్ లో రెండు నెలల పాప కిడ్నాప్ కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చివరికి ఆ పాపను రక్షించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఓ తల్లిదండ్రుల నుంచి ఓ మహిళ, యవకుడు రెండు నెలల పాపను కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ మహిళ ఆ పాపను ఎత్తుకుని బస్సు ఎక్కి వెళ్లిపోయింది. ఇదంతా ఆస్పత్రి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే స్పందించిన ఆ పాప తల్లిదండ్రులు వెంటనే అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితులు పాపను మహారాష్ట్రకు తీసుకెళ్తుండగా రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కూతురు సురక్షితంగా వారి చెంతకు చేరడంతో ఆ పాప తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోయారు. ఆ తర్వాత పోలీసులు నిందితులైన మహిళ, యువకుడిని అరెస్ట్ చేశారు.
— Hardin (@hardintessa143) April 28, 2023