స్కూల్ లో పిల్లలకు చదువు చెప్పాల్సిన కొందరు గురువులే దారి తప్పి అడుగుల వేస్తున్నారు. అందమైన బాలికలపై కొందరు కీచక టీచర్ లు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు దిగుతున్నారు. ఇలాంటి దారుణాలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలాంటివి మరువముందు ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం బయటకు వచ్చింది. స్కూల్ లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వస్తున్న ఓ కీచక టీచర్ 8వ తరగతి బాలికకు లవ్ లెటర్ రాశాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెనకాల అసలేం జరిగిందనే పూర్తి సమాచారం మీ కోసం.
ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ ప్రాంతం. ఇక్కడే ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇదే పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుకుంటుంది. కాగా అదే బాలికపై ఆ ఉపాధ్యాయుడు ఎప్పటి నుంచి కన్నేశాడు. ఆ బాలిక వైపు ఒక రకంగా చూడడం, అనవసరంగా మాట్లాడడం చేస్తుండేవాడు. ఇక ఇంతటితో ఆగని ఈ గురువు.. ఇటీవల ఆ బాలికకు ప్రేమిస్తున్నానంటూ లవ్ లెటర్ కూడా రాసిచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సెలవుల్లో నిన్ను బాగా మిస్ అవుతున్న, స్కూల్ కు తొందరగా రా. మన ఇద్దరం పక్క పక్కనే కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందామని ఆ ఉపాధ్యాయుడు రాసిన లవ్ లెటర్ లో తెలిపాడు.
ఇక ఇదే విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది. కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కీచక టీచర్ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. చదువు చెప్పాల్సిన గురువులే ఇలా ప్రేమ పాఠాలు చెబుతూ బాలికల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. ఇలాంటి టీచర్లకు ఎలా బుద్ది చెప్పాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.