రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు.. కొందరు మగాళ్లు మృగాళ్లలా రెచ్చిపోతున్నారు. అచ్చం ఇలాగే ప్రవర్తించాడు ఓ రిక్షా డ్రైవర్. కాలేజ్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించి పాడు పనులకు తెర లేపాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ రోజుల్లో కొందరు మగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. రోడ్డుపై అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. కామంతో ఊగిపోతున్నారు. ప్రేమించాలని వెంటపడడం, కాదంటే హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ రిక్షా డ్రైవర్.. కాలేజ్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడు నుంచి బయట పడేందుకు ఆ అమ్మాయి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. యూపీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ అక్బర్ పూర్ పరిధిలోని షాజాద్ పూర్ ఫౌంటెన్ ప్రాంతంలో ఓ వ్యక్తి ఈ- రిక్షాను నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఓ విద్యార్థిని కాలేజ్ కు వెళ్లేందుకు అతని రిక్షా ఎక్కింది. ఇక ఆటో బయలుదేరే ముందు ఆ రిక్షా డ్రైవర్.. ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయబోయాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ అమ్మాయి.. పెద్దగా అరుపులు వేసింది. వెంటనే గమనించిన స్థానికులు ఏం జరిగిందంటూ ఆ అమ్మాయిని అడిగి తెలుసుకున్నారు.
కోపంతో ఊగిపోయిన స్థానికులు ఆ రిక్షా డ్రైవర్ ను చితకబాదారు. అంతే కాకుండా నడి రోడ్డుపై అతని బట్టలు విప్పి గట్టిగా బుద్ది చెప్పారు. ఆ తర్వాత ఆ దుర్మార్గుడిని అందరూ కలిసి పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. కాలేజ్ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) May 17, 2023