దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా కామాంధులు ఎక్కడబడితే అక్కడ రెచ్చిపోతున్నారు. ఒకదశలో మహిళలు పట్టపగలు కూడా ఒంటరిగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
ఈ మద్య ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాల పర్వం కొనసాగుతుంది. మహిళలు ఒంటరిగా పట్టపగలు వీధుల్లో నడవాలన్నా భయంతో వణికిపోతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. వాటిని ఏమాత్రం లేక్క చేయడం లేదు. తాజాగా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది.. ఓ సైకో ఇద్దరు మహిళలపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ అమలాపురం పట్టణం ఏఎంజి కాలనీ లో మంగళవారం ఇద్దరు మహిళలపై ఓ సైకో కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళలు 4 గంటల ప్రాంతంలో ఇంటి బయట పని చేసుకుంటున్నారు. అదే సమయంలో ఓ సైకో పదునైన కత్తి తీసుకు వచ్చి మహిళ మెడపై కోశాడు.. దాంతో తీవ్రంగా గాయపడ్డ మహిళ గిల గిల కొట్టుకొని చనిపోయింది. మరో మహిళను కూడా అదే రీతిలో చంపాలని ప్రయత్నించాడు.. కానీ ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై సైకో ఇష్టం వచ్చినట్లు గాయం చేశాడు. దాడిలో గాయపడ్డ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరో ఇంటి యజమానిపై కూడా సైకో దాడికి ప్రయత్నించాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే స్థానికులు సైకోని పట్టుకున్నారు.
ఇక సైకో దాడిలో చనిపోయిన మహిళపేరు శ్రీదేవి (28)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన మహిళ పేరు వెంకటరమణగా గుర్తించారు. ఇంటి ముందు పని చేసుకుంటూ ఉన్న సమయంలో హఠాత్తుగా శ్రీదేవి వెనుక నుంచి వచ్చి ఆమె పీకను కోయడంతో అక్కడిక్కడే మరణించింది. వెంకటరమణ సైకోని ప్రతిఘటించడంతో కోపంతో ఊగిపోయి విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్పటికే అక్కడికి స్థానికులు వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా వారిపై కూడా దాడికి యత్నించాడు. ఎలాగో అలా ఆ సైకోని పట్టుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సైకోని అదుపులోకి తీసుకొని చనిపోయిన శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వెంకటరమణను అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.