నిర్మల్ జిల్లా కొండాపూర్ బైపాస్ వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బైపాస్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మందికి తీవ్ర గాయాలు,15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. యూపీకి చెందిన ప్రైవేటు బస్సు హైదరబాద్ నుంచి యూపీ కి వెళ్తుండా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు యూపీకి చెందినది. ఈ ప్రమాదం ఉదయం 5 గంటల సమయంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.