సంగారెడ్డికి చెందిన కేతావత్ బుజ్జి ఈ నెల 9న బయటకు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. కానీ, రాత్రి అయినా ఆ మహిళ తిరిగి ఇంటికి చేరుకోలేదు. కట్ చేస్తే.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతీ చిన్న విషయానికే ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. మరికొంత మంది మాత్రం.. ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వివాహిత ఈనెల 9న బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ, చీకటి పడిన తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనేక సార్లు ఫోన్ లు చేశారు. అయినా ఎటువంటి స్పందన రాలేదు. అయితే వారం రోజులు దాటినా ఆ వివాహిత ఆచూకి మాత్రం దొరకలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి పరిధిలోని ఫసల్వాది తండాలో కేతావత్ బుజ్జి (42) అనే వివాహిత నివాసం ఉంటుంది. బయటకు వెళ్లొస్తానని ఈ నెల 9న ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పి వెళ్లింది. చీకటి పడిన బుజ్జి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖంగారుపడి అనేక సార్లు ఫోన్ లు చేశారు. అయినా అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరుసటి రోజు సైతం ఆమె జాడ కోసం కుటుంబ సభ్యులు అనేక చోట్ల గాలించారు. ఇక చేసేదేం లేక బుజ్జి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే బుజ్జి ఆచూకి తెలిస్తే.. 8712656746 నెంబర్ సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఉన్నట్టుండి బుజ్జి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.