ఆడవాళ్ళు కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారి తల్లుల నుండి తల్లి వయసున్న మహిళల వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వర్క్ ప్లేస్‌లో, పబ్లిక్ ప్లేసుల్లో ఇలా ఎక్కడా కూడా వారికి రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవడు ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ చేయి వేస్తాడో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు నేడు ఆడవాళ్ళు. మమూలు మహిళలకే కాదు, జడ్జి హోదాలో ఉన్న మహిళలకీ ఈ లైంగిక వేధింపులు తప్పడం లేదు. న్యాయం చెప్పే జడ్జికే రక్షణ లేదంటే ఇక మామూలు ఆడపిల్లల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ దురదృష్టకరమైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ముంబైకి చెందిన మహిళా జడ్జి పని మీద ముంబై హైకోర్టుకు లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా.. ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. శాంతాక్రూజ్, చర్చ్‌గేట్ స్టేషన్‌ల మధ్య ప్రాంతంలో లోకల్ ట్రైన్‌లో ఉమెన్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కిన మహిళా జడ్జిని.. నీరాజ్ మియాన్(33) వెంబడించాడు. ఉమెన్ కోచ్‌లో ఎక్కినప్పటికీ ఆమెను నీరాజ్ వదిలిపెట్టలేదు. ఆమెను ఫాలో అవుతుండడంతో సదరు జడ్జి.. తన సహోద్యోగులకు సమాచారం ఇచ్చారు. తర్వాతి స్టేషన్‌లో వాళ్ళు నీరాజ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. అతను స్థానికంగా హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. మరి మహిళా జడ్జిని ఫాలో అవుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డ వెయిటర్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.