మంగళగిరిలో వడ్డీ వ్యాపారీ నయా మోసం బట్టబయలు బయలైంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మందికి పంగనామాలు పెట్టి రూ.40 వసూలు చేసి పరారయ్యాడు. ఇక విషయం ఏంటంటే..? మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో గత 30 సంవత్సరాలుగా పుట్ట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జనాలను నమ్మించి తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుని బయట అధిక వడ్డీలకు ఇవ్వడం వెంకటేశ్వర్లు వ్యాపారం.
అయితే ఇటీవల కాలంలో 300 మంది వద్ద డబ్బులు తీసుకుని సుమారు రూ.40 కోట్లు తీసుకుని పరారయ్యాడు. ఇక కొన్నాళ్ల నుంచి వెంకటేశ్వర్లు కనిపించకపోవడంతో బాధితులు ఒక్కసాగిరగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో అర్థం కాక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపి పుట్ట వెంకటేశ్వరరావును పట్టుకొని తమకు న్యాయం చేసి తమ డబ్బును తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి ,నాలి చేసుకొని కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా అతని వద్ద పెట్టామని, డబ్బులు తమకు ఇప్పించ కుంటే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు వాపోతున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు పుట్ట వెంకటేశ్వర్లు కోసం గాలిస్తున్నారు. 300 మందిని నమ్మించి మోసానికి పాల్పడ్డ పుట్ట వెంకటేశ్వర్లు తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.