ఇండోనేషియాలో ఊహించని ప్రమాదం సంభవించింది. కదులుతున్న ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఊహించని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా 14 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? మంగళవారం 240 మంది ప్రయాణికులతో కుంపాంగ్ నుంచి కలాబాహి వరకు ఓ ఓడ బయలుదేరింది. అయితే ప్రయాణంలో ఉండగానే ఉన్నట్టుండి ఆ ఓడలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాక అరుస్తే కేకలు వేశారు.
ఇక వెంటనే అలెర్ట్ అయిన భద్రతా సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 14 మంది సజీవ దహనం అయినట్లుగా సమాచారం. భద్రతా సిబ్బంది ఓడలో చిక్కుకున్న 226 మంది ప్రయాణికులను సిబ్బంది కాపాడారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు సామార్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు అనుమనిస్తున్నారు. ఇక ఈ ఘోర అగ్ని ప్రమాదం భయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.