నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ భరించలేని బాధతో కుటుంబం బతకాలనుకులేదు. ఆదుకునే వారి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భరించలేని బాధతో ఆ కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆ కుటుంబంలో ఒకరు మరణించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అసలు ఈ కుటుంబం ఎందుకు చనిపోవాలనుకుంది? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండలం జానకంపేట. ఇదే గ్రామంలో సాయిలు (40), సురేఖ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి అరుణ్, చరణ్ అనే కుమారులు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలతో వీరి కాపురం ఎంతో ఆనందంగా సాగింది. అయితే సాయిలు గతంలో కుటుంబం అవసరం నిమిత్తం కొంతమంది వద్ద అప్పులు చేశాడు. వారు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. దీంతో అప్పు తీర్చే స్థోమత లేకపోవడంతో రోజు రోజకు మిత్తితో పాటు అప్పు మరింత పెరిగిపోతుంది. ఈ దంపతులు బంధువులను, గ్రామస్తులను అందరినీ అప్పు అడిగాడు. కానీ ఎవరూ కూడా సాయిలును ఆదుకునేందుకు ముందుకు రాలేదు. అప్పుల భారం మరింత పెరిగిపోవడంతో ఈ దంపతులు తట్టుకోలేకపోయారు.
ఈ సమయంలో ఈ దంపతులకు జీవితంపై విరక్తి కలిగింది. ఇక ఇలాంటి బతుకు మా కొద్దు అని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. తాజాగా ఈ దంపతులు పిల్లలతో పాటు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ భర్త సాయిలు ప్రాణాలు కోల్పోగా.., భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పిల్లలకు ఎలాంటి ప్రాణాప్రాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.