ప్రేమ.. దీనికి కులం, మతం, ప్రాంతంతో పని లేదు. పైగా ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో కూడా అస్సలు చెప్పలేం. ఈ మధ్యకాలంలో 20 ఏళ్ల యువతితో 60 ఏళ్ల వృద్ధుడు ప్రేమలో పడిపోతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా చివరికి ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. ఇదిలా ఉంటే నేపాల్ కు చెందిన ఓ యువతికి ఫేస్ బుక్ ద్వారా బీహార్ కు చెందిన ఓ యువకుడితో ఏర్పడింది. ఈ పరిచయంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా కొన్ని రోజుల పాటు వీరి ఫేస్ బుక్ ప్రేమాయణం కొనసాగింది. అయితే ప్రియురాలు మాత్రం ప్రియుడి కోసం ఎలాగైన దేశం దాటి వెళ్లాలనుకుంది. ఇక ఇంతటితో ఆగకుండా పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. ఇంతకి ఈ ఆ యువతి దేశం దాటి ప్రియుడిని కలుసుకుందా? కలుసుకున్న తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుందా? ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటనేది తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే.
బీహార్ రాష్ట్రం రోస్టా పరిధిలోని బిషన్ పూర్. ఇదే ప్రాంతంలో వికాస్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఫేస్ బుక్ ద్వారా నేపాల్ కు చెందిన పార్వతి అనే యువతి పరిచయం అయింది. దీంతో రోజూ ఇద్దరు తరుచు ఛాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. అలా రాను రాను ఇద్దరికి తెలియకుండానే ప్రేమలో పడిపోయారు. దీంతో తరుచు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా కొన్ని నెలల గడిచింది. పార్వతికి మాత్రం ప్రియుడు వికాస్ కుమార్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంతటితో తన ఫేస్ బుక్ ప్రేమకు పుల్ స్టాప్ పెట్టని ఆ యువతి.. ఎలాగైన తన ప్రియుడిని కలుసుకోవాలనుకుంది. ఇందులో భాగంగానే ఆ యువతి ఇటీవల నేపాల్ వదిలి ఇండియాకు వచ్చింది.
రావడమే కాకుండా బీహార్ లో ఉన్న తన ప్రియుడి వద్దకు చేరుకుంది. దీంతో ఇద్దరు కలుసుకుని చివరికి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అనంతరం ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత ప్రియురాలు తన ప్రియుడిని నేపాల్ కు రావాలంటూ ఆహ్వానించింది. కానీ, దీనికి ప్రియుడు వికాస్ కుమార్ అంగీకరించలేదు. దీంతో పోలీసులు ఇద్దరికి కౌన్స్ లింగ్ ఇచ్చారు. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? పార్వతికి ఇది వరకే ఓ యువకుడితో వివాహం జరిగింది. అయినా సరే భర్తను కాదని ప్రేమించినవాడి కోసం దేశం దాటి చివరికి తన ప్రేమను గెలుచుకుంది. తాజాగా ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. దేశాలు దాటిన ఈ ఫేస్ బుక్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.