తల్లిదండ్రులు తమ పిల్లలని బాగా చదువుకోవాలని హస్టల్ కు పంపిస్తుంటే. అదే వసతి గృహాలు కొందరు చెడు దారిలో వెళ్లటానికి మార్గం అయింది. మాములు క్రికెట్ అంటేనే బెట్టింగ్ లు జరుగుతుంటాయి. ఇంక టీ-20 ప్రపంచ కప్ అంటే బెట్టింగ్ ల జోరు ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. టీ20 ప్రపంచ కప్ సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ఓ వసతి గృహంలో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో హస్టల్ పై దాడి నిర్వహించి నిందితుల నుంచి రూ.15 లక్షల సొమ్ము,11 స్మార్ట్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ వెంటేశ్వర్లు మాట్లాడుతూ.. బెట్టింగ్‌పై వచ్చిన పక్కా సమాచారంతోనే దాడి నిర్వహించినట్లు తెలిపారు. రోజుకు రూ.800 రూమ్ కి అద్దె చెల్లిస్తూ నెల రోజుల పాటు తీసుకున్నట్లు సమాచారం. ఒకేసారి 200 మందితో పందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన నిర్వహకుడు ఖాసిఫ్ ఉమర్ తోపాటు మరో ఇద్దరు బుకీలు పరారీలో ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు తెలిపారు. బెట్ 365, డ్రీం11, ఎంపీఎల్ బేట్ వే, డ్రీమ్ గురు, మై 11 సర్కిల్, 777 బెట్ లాంటి యాప్ లు అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.