దేశంలో వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు వైద్య రంగానికే మాయని మచ్చలా మిగులుతున్నాయి. ఇటీవలే వైద్యం అందక చిన్నారి మృతి చెందిన ఘటన మరవక ముందే మరో సంఘటన వెలుగు చూసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన చేయిని కోల్పొవడమే కాకుండా ఆమె పెళ్లి కూడా రద్దు అయ్యింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రేఖ.. బిహార్ లోని శివనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి. అయితే ఆమెకు ఇటీవల చెవి నొప్పి రావడంతో పట్నాలోని మహావీర్ ఆరోగ్య సంస్థాన్ వైద్యశాలకు వెళ్లింది. రేఖను పరిశీలించిన డాక్టర్లు ఆమెకు జులై 11న చెవికి ఆపరేషన్ చేశారు. వారు సర్జరీ చేసే క్రమంలో రేఖ చేతికి ఒక ఇంజక్షన్ ను ఆమె చేతికి వేశారు. ఇక ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన రేఖకు కొన్నిరోజుల తన చేయి రంగు మారడం, నొప్పి రావడం ప్రారంభం అయ్యాయి.
దాంతో ఆమె అదే హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించగా వైద్యం చేసి తగ్గుతుందని పంపించేశారు. కొన్ని రోజులు చూసిన తర్వాత కూడా నొప్పి తక్కువ కాక పోవడంతో చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగింది. చివరికి పట్నాలోని మేదాంత వైద్యశాలలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అక్కడి వైద్యులు చెప్పిన విషయాలకు వారు ఆశ్చర్య పోయారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె చేయి ఎడమ చేయి డ్యామేజ్ అయ్యిందని దానిని తొలంగించాలని సూచించారు. ఇక చేసేది ఏమీ లేక వారు సర్జరీకి అంగీకరించడంతో ఆగష్టు 4 రేఖ ఎడమ చేయిని మోచేతి దాక తొలగించారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్రం అంతాటా సంచలనం సృష్టించింది. ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏంటంటే నవంబర్ లో వివాహం జరగాల్సిన రేఖకు చేయి తీసేయ్యడంతో పెళ్లి కొడుకు తరపు వారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై అధికారులు నర్స్ జ్యోతిపై, డాక్టర్లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరి ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాద సంఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.