నేటి తరం సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తూ సమాజాన్ని చెడు దారికి మార్గం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..జవహార్ నగర్ పరిదిలోని న్యూ విరాట్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఇక 14 సంవత్సరాల బాలుడు ప్రవీణ్ వారి బంధువు అయిన 4 ఏళ్ల బాలికపై ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి తెగబడ్డాడు.
ఇక ఈ వార్త తల్లిదండ్రులకు తెలియటంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు రోజుకొకటి పుట్టికొస్తున్నాయి. నిర్భయ లాంటి బలమైన చట్టాలున్నా…చుట్టాల్లా పలకిరిస్తున్నాయే తప్పా న్యాయం జరగటం లేదని బాదితుల తల్లిదండ్రులు వాపోతున్నారు.