భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయడం ఇప్పుడు సర్వసాధారణం. అలాంటి సందర్భంలో వారి పిల్లలను చూసుకోవడానికి ఆయానో, కేర్ టేకర్ నో ఆశ్రయించక తప్పదు. తమ 8 నెలల బాబును చూసుకునుందేకు ఓ కేర్ టేకర్ ను పెట్టుకోవడమే వారి పాలిట శాపంగా మారింది. తమ పిల్లాడిని ఇష్టారీతిన కొట్టి అతను కోమాలోకి వెళ్లేలా చేసింది ఆ కేర్ టేకర్.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఈ దారుణ ఘటన సూరత్ జిల్లాలోని రాండెర్ సిటీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పటేల్- అతని భార్య ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి 8 నెలల పిల్లాడి ఆలనాపాలనా చూసుకునేందుకు కోమల్ టెండుల్కర్ అనే ఓ కేర్ టేకర్ ను పెట్టుకున్నారు. ఆమె పిల్లాడి ఏడుపు ఆపేందుకు విచక్షణారహితంగా ఇష్టారీతిన కొట్టింది. పిల్లాడ్ని విసిరి కొట్టింది. చెంపలపై కొట్టింది. ఆమె దెబ్బలతో పిల్లాడు స్పృహ కోల్పోయాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లాడి తల, బ్రెయిన్ కు గాయాలయ్యాయి. అతను ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
కోమల్ టెండుల్కర్ చేసిన ఈ దారుణం.. సీసీటీవీలో రికార్డు అయ్యింది. తల్లిందండ్రుల ఫిర్యాదుతో ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి పరిస్థితి గురించి ఎలాంటి విషయాన్ని చెప్పే పరిస్థితి లేదని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.