ఏపీలో 7వ తరగతి విద్యార్థిని ఉన్నట్టుండి కనిపించకుండాపోయింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లాలో 7వ తరగతి చదువుతున్న బాలిక శుక్రవారం నుంచి కనిపించకుండాపోయింది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయినా కూతురు జాడ మాత్రం కనిపించలేదు. ఇక చేసేదేంలేక ఆ బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి అర్భన్ పట్టణంలోని నందలపాడు ప్రాంతం. ఇక్కడే సమీరా (14) అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటూ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్ లో 7వ తరగతి చదువుతుంది.
అయితే ఉన్నట్టుండి సమీరా శుక్రవారం తెల్లవారుజామున నుంచి కనిపించకుండాపోయింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా ఖంగారుపడ్డారు. బంధువులందరికీ ఫోన్ చేసి సమీర ఆచూకి కోసం అడిగి తెలుసుకున్నారు. అయినా కూతురి జాడ మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలో తెలియక ఆ బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు