మొన్నీ మధ్య ఢిల్లీలో జరిగిన అంజలి ఘటన గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో కారు కింద భాగంలో ఇరుక్కుపోయిన ఆమె చాలా దారుణంగా చనిపోయింది. ఈ సంఘటన డిసెంబర్ 31న చోటు చేసుకుంది. ఈ ఘటన తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి కూడా. తాజాగా, ఓ వృద్ధుడ్ని స్కూటీతో లాక్కెళ్లాడు ఓ యువకుడు. పట్టపగలు, నడిరోడ్డుపై వృద్ధుడ్ని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ సంఘటన బెంగళూరులో ఆసల్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 71 ఏళ్ల ముత్తప్ప అనే వ్యక్తి తన బొలెరో కారులో రోడ్డుపై వెళుతూ ఉన్నాడు.
అదే రోడ్డుపై సోహెల్ అనే వ్యక్తి తన స్కూటీలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ చోట సోహెల్ స్కూటీ బొలెరో కారును ఢీకొట్టింది. దీంతో ముత్తప్పకు కోపం వచ్చింది. కారులోనుంచి సోహెల్‌పై కేకలు వేశాడు. తర్వాత కిందకు దిగాడు. సోహెల్‌తో గొడవ పెట్టుకున్నాడు. సోహెల్ మాత్రం తనకు ప్రమాదంతో సంబంధం లేదు అన్నట్లు అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ముత్తప్ప సోహెల్ స్కూటీ వెనక భాగాన్ని పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, ముత్తప్ప స్కూటీని గట్టిగా పట్టుకోగానే సోహెల్ స్కూటీని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ముత్తప్ప ఒక్క ఉదుటున కిందపడ్డాడు. అయినా ఆయన స్కూటీని విడవలేదు. సోహెల్ కూడా ముత్తప్ప కిందపడ్డా వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.
అలా వేగంగా ముందుకు దూసుకుపోయాడు. ముత్తప్ప వెనకాల వేలాడుతూ ఉండగా రోడ్డుపై వేగంగా ఈడ్చుకెళ్లాడు. ఇది గమనించిన రోడ్డుపై వెళుతున్న వాహనదారులు అతడ్ని అడ్డగించారు. ఈ ఘటనలో ముత్తప్పకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఆ వీడియో ఆధారంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముత్తప్ప ఆరోగ్యం బాగానే ఉంది. మరి, స్కూటీతో వృద్ధుడ్ని లాక్కెళ్లిన యువకుడి అరాచకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
On Camera, 71-Year-Old Dragged By Scooter On Bengaluru Road After Accident https://t.co/NSLfiGUf8r pic.twitter.com/IXq9B6Pw7Y
— NDTV (@ndtv) January 17, 2023