ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఒక అమ్మాయి కనబడకుండా పోయింది. తమ కూతురు కనబడడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే కొన్ని రోజులకి ఒక అమ్మాయి మృతదేహం కనబడింది. దాన్ని కూతురు మిస్ అయ్యిందని ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు చూపిస్తే.. ఆ అమ్మాయి తమ బిడ్డే అని అన్నారు. దీంతో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపాడని ఒక యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలు శిక్ష వేయించారు. అతను ఇప్పుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. కట్ చేస్తే జైల్లో ఉన్న యువకుడు చంపిన అమ్మాయి తిరిగి వచ్చింది. పెళ్లి చేసుకుని పిల్లలతో తిరిగి వచ్చింది. లేచిపోయిందండి.. ప్రేమించినోడితో చెప్పాపెట్టకుండా లేచిపోయింది. పిల్లల్ని కని ఏడేళ్ల తర్వాత ఇంటికొచ్చింది.
పాపం ఏడేళ్ల నుంచి అనవసరంగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న యువకుడి పరిస్థితి ఏంటి? చంపకుండా చంపాడని ఆరోపించి జైల్లో పెట్టారు. ఏడేళ్లు నరకం అనుభవించాడు. అయితే తన కొడుకు నిర్దోషి అని యువకుడి తల్లికి తెలుసు. అందుకు తగిన సాక్ష్యాలను కూడా తయారుచేసుకుంది. ఈ క్రమంలో ఆ మిస్ అయిన అమ్మాయి, చనిపోయిన అమ్మాయి ఒకరు కాదని తేలింది. హత్యకు గురైన అమ్మాయిని చంపింది తన కొడుకు కాదని, తన కొడుకు శిక్షకు కారణమైన అమ్మాయి బతికే ఉందని సాక్ష్యాలతో సహా బయటపెట్టిందా యువకుడి తల్లి. చూస్తుంటే ఇదొక సినిమా స్టోరీలా అనిపిస్తుంది కదూ. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ప్రేమించినోడితో లేచిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేసింది. పాపం ఆ అమ్మాయిని చంపాడన్న ఆరోపణలతో ఏడేళ్ల నుంచి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడో యువకుడు.
ఆ నిబ్బీ చేసిన పని తలచుకుంటే రక్తం మరిగిపోతుంది కదూ. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 17 ఏళ్ల వయసున్నప్పుడు ఒక అమ్మాయి గుడికి వెళ్ళింది. అప్పటి నుంచి తమ కూతురు కనబడడం లేదని అలీఘడ్ పోలీస్ స్టేషన్ లో 2015 ఫిబ్రవరి 17న అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 363, 366 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కేసుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆగ్రాలో ఒక గుర్తు తెలియని అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపిస్తే వాళ్ళు తమ బిడ్డే అని గుర్తించారు. విష్ణు అనే వ్యక్తి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి, చంపేశాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించడంతో పోలీసులు అలీఘడ్ లో ఉన్న జైల్లో బంధించారు.
ఈ ఘటన జరిగి ఏడేళ్లు అవుతుంది. ఇప్పటికీ విష్ణు జైల్లోనే ఉన్నాడు. అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగిందని అందరూ సంబరపడ్డారు. కట్ చేస్తే ఆ అమ్మాయి బతికే ఉంది. చనిపోయిందనుకుని కేసు క్లోజ్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగే షాకిచ్చింది. ఆ యువతి చనిపోలేదని తెలిసింది. ఏకంగా పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కని మరీ హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం 17 ఏళ్ల వయసులో ఈ నిబ్బీ.. ఒక నిబ్బాతో లేచిపోయి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుని భర్త నిబ్బాతో కొన్నాళ్ళు హత్రాస్ జిల్లాలో నివాసం ఉండి, ఆ తర్వాత ఆగ్రా వెళ్ళిపోయింది. అయితే తన కొడుకు విష్ణు అమాయకుడు అని నమ్మిన అతని తల్లి నిబ్బీ ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది.
ఆ అమ్మాయి ఖచ్చితంగా చనిపోలేదని, పోలీసులు చూపించిన మృతదేహం ఆ అమ్మాయిది కాదని అనుమానంతో రీసెర్చ్ చేసింది. అలీఘడ్ లో ఉన్న కొంతమంది మత పెద్దల సహకారంతో వెతకడం మొదలుపెడితే.. ఓ మతపరమైన కార్యక్రమంలో ఆ అమ్మాయి విష్ణు తల్లి కంటపడింది. పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగారు. ఆ అమ్మాయి ఆగ్రాలో భర్త, పిల్లలతో కలిసి ఉంటుందని తెలుసుకున్నారు. ఎట్టకేలకు ఆ అమ్మాయిని నాగ్ల చౌక్ గ్రామంలోని హత్రాస్ గేట్ ప్రాంతం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ అమ్మాయి, 2015లో తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న అమ్మాయి ఒకటేనని ఆ అమ్మాయి ఒప్పుకుంది. అయితే పోక్సో కోర్టు అమ్మాయి డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆదేశించింది. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ కేసులో రాజీ పడమని బలవంతం చేస్తున్నారని విష్ణు తల్లి ఆరోపణలు చేస్తుంది.
Who’s responsible for Vishnu’s 7 years of life that he suffered for?
What about the identity of an unknown dead body?
Will legal system be held accountable?
— Anshul Saxena (@AskAnshul) December 7, 2022
తప్పిపోయిందనుకున్న అమ్మాయి, హత్యకు గురైన అమ్మాయి ఒకరు కాదు. చనిపోయిందనుకున్న అమ్మాయి నిబ్బీలా నిబ్బాని పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకుంది. గుర్తు తెలియని మృతదేహం కనబడితే.. పోలీసులు, అమ్మాయి తల్లిదండ్రులు విష్ణు హత్య చేశాడని ఆరోపించి శిక్ష పడేలా చేశారు. ఇప్పటికీ అతను జైల్లోనే ఉన్నాడు. మరి హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని చంపింది ఎవరు? ఏ తప్పూ చేయని విష్ణుని అన్యాయంగా ఎందుకు ఇరికించారు? తన జీవితంలో కోల్పోయిన 7 ఏళ్ళని ఎవరు తిరిగిస్తారు? ఏడేళ్లు జైల్లో అనుభవించిన నరకానికి బాధ్యులు ఎవరు? ఒక నిబ్బీ ప్రేమ వల్లే కదా ఒక యువకుడికి అన్యాయం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తర్వాత జరిగే పరిణామాలు ఏంటో అని కనీస ఆలోచన లేకుండా తమ ప్రేమే గొప్పదని ఫీలయ్యే నిబ్బీ, నిబ్బాలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.