గతంలో అమ్మాయిని భారంగా భావించి.. బాల్య వివాహాలు చేసేవారు. వీటికి తోడు..కన్యాశుల్కం, వరకట్నం వంటి దురాచారాలు బాల్యవివాహాలు జరిగేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పేదింట పుట్టిన ఆడపిల్లలను సాకలేక తల్లిదండ్రులు.. చిన్న వయస్సులోనే పిల్లలు వివాహం చేసేస్తున్నారు. కాలం మారినా.. తల్లిదండ్రులు మారడం లేదని నిరూపితమైందీ మరోసారి..
దేశం సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళుతోంది. గతంతో పోల్చకుంటే విద్యాధికులు ఎక్కువ. మంచి, చెడు తెలుస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. తమ కష్టాలు పిల్లలు పడకూడదని మారుమూల ప్రాంత ప్రజలు కూడా ఆలోచిస్తూ.. పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. కానీ ఇంకా గూడుకట్టుకున్న అనాగరికత కొంత మందిని చైతన్యవంతులను చేయడం లేదు. గతంలో అమ్మాయిని భారంగా భావించి.. బాల్య వివాహాలు చేసేవారు. వీటికి తోడు..కన్యాశుల్కం, వరకట్నం వంటి దురాచారాలు బాల్యవివాహాలు జరిగేలా చేస్తున్నాయి. ముఖ్యంగా పేదింట పుట్టిన ఆడపిల్లలను సాకలేక తల్లిదండ్రులు.. చిన్న వయస్సులోనే పిల్లలు వివాహం చేసేస్తున్నారు. తాజాగా ఏడేళ్ల చిన్నారిని మధ్యవయస్కుడైన వదువుకు ఇచ్చి పెళ్లి చేశారు. అతడికిచ్చి పెళ్లి చేసేందుకు కన్యా శుల్కం కింద తల్లిదండ్రులు రూ. 4.50 లక్షలు పొందారు.
ఈ ఘటన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కన్యాశుల్కం కోసం ఆశపడిన తండ్రి.. కుమార్తెను తన వయస్సు వ్యక్తితో పెళ్లి చేశాడు. కూతుర్ని రూ. 4.50 లక్షలకు అమ్మేశాడు. ఈ ఘటన మానియాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల భూపాల్ సింగ్‌తో తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడో తండ్రి. ఒప్పందం కుదుర్చుకున్న మేరకు డబ్బులు చెల్లించి.. భూపాల్ సింగ్ బాలికను వివాహం చేసుకున్నాడు. మే 21న పెళ్లి జరిగింది. ఈ సమాచారం పోలీసుల దృష్టికి చేరింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మానియా) దీపక్ ఖండేల్వాల్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి బాలిక ఉంటున్న ఇంటిపై దాడి చేసి.. ఆమెను ఆ కూపంలో నుండి బయటపడేశారు. అయితే ప్రాథమిక విచారణలో మధ్యప్రదేశ్‌లో ఓ హత్య కేసులో జైలు శిక్ష తర్వాత నిందితుడి కుటుంబం గ్రామంలో స్థిరపడినట్లు తేలింది. తండ్రికి రూ. 4.50 లక్షలు చెల్లించి అతడి కుమార్తెను కొనుగోలు చేసినట్లు భూపాల్ సింగ్ కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.