Army Jawans: లడఖ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం నదిలో పడిన ఘటనలో ఏడుగురు జవాన్లు మృత్యువాత పడగా.. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ క్యాంపునుంచి మరో చోటుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం 26 మంది జవాన్లు పర్‌తాపూర్ క్యాంపునుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌కు ట్రక్కులో బయలు దేరారు. స్యోక్ నదిపై వెళుతుండగా ట్రక్కు టైరు కొద్దిగా జారింది. దీంతో ట్రక్కు దాదాపు 60 అడుగుల లోతులో ఉన్న నదిలోకి పడిపోయింది. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గాయపడ్డవారిని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురు జవాన్లు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని ప్రాణాలతో కాపాడేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో తీవ్రంగా గాయపడ్డ వారిని వెస్ట్రన్ కమాండ్‌కు తరలిస్తామని పేర్కొంది. కాగా, బుధవారం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. శ్రీనగర్‌లో క్యాబ్ నదిలో పడ్డ ఘటనలో ఓ ఆర్మీ జవాన్‌తో పాటు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. వీరంతా క్యాబ్‌లో కార్గిల్‌నుంచి శ్రీనగర్ వెళుతుండగా ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి : Adilabad Crime: కన్న కూతురిని గొంతుకోసి చంపిన తల్లితండ్రులు! కారణం?