Hyderabad: అక్కరకు రాని పెన్షను, ఏ ఒక్కరికీ పనికిరాని టెన్షనూ రెండూ ఒకటే. పెన్షన్ తీసుకునే ఏజ్‌లో పనికిరాని టెన్షన్‌ని నెత్తిన పెట్టుకున్నాడో వృద్ధుడు. ఇంకేముంది పోలీసులు తీసుకెళ్ళి లోపలేశారు. హైదరాబాద్ శివారులో ఉపాధి పేరుతో వల వేసి కాలేజీ అమ్మాయిలు, మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వృద్ధుడ్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలానికి చెందిన కీసనకుర్తి వెంకట సత్యనారాయణ అనే 65 ఏళ్ళ వ్యక్తి, సిరిగడి అరుణ అనే మహిళతో కలిసి జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. అరుణ, సత్యనారాయణ ఈ ఇద్దరూ తరచుగా ఇండ్లని మారుస్తూ ఈ దందా నిర్వహిస్తున్నారు. జవహర్‌నగర్ పీఎస్ లిమిట్స్‌లో ఇళ్లని అద్దెకు తీసుకుని ఏపీ నుంచి వచ్చే మహిళలని టార్గెట్ చేస్తూ ఈ వ్యభిచార దందా నడుపుతున్నారు.
మంచి జీవనోపాధి కల్పిస్తామని ఆశ చూపించి బలవంతంగా మహిళలను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. మగాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తం మీద డబ్బులు కలెక్ట్ చేస్తూ గుట్టుగా ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై రైడ్ చేశారు. దుమ్మాయిగూడ వాయుశక్తినగర్‌లోని ఓ ఇంటిపై రాచకొండ పోలీసులు రైడ్ చేసి వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహంలో నిర్బంధంగా పడి ఉన్న మహిళలను, యువతులను పోలీసులు రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ఉపాధి పేరుతో మోసం చేసిన వెంకట సత్యనారాయణపై రాచకొండ పోలీస్ కమిషనరేట్ అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గతంలో కూడా సత్యనారాయణ మీద జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వ్యభిచారం కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారి పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. మరి వ్యభిచార ఉచ్చులో ఇరుక్కున్న మహిళల్ని కాపాడిన పోలీసులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.
One habitual #HumanTrafficking offender viz… Keesanakurthi Venkata Sathyanarayana has been detained under #PD_Act by #CP_Rachakonda Sri. #Mahesh_Bhagwat_IPS on 27-07-2022.@TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @eenadulivenews @sakshinews @DeccanChronicle pic.twitter.com/Jun1xrFa64
— Rachakonda Police (@RachakondaCop) July 27, 2022