సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయ నాయకుల నుంచి.. క్రీడాకారులు, సినీ హీరోలు, సెలబ్రిటీలు, సామాన్యుల వరకు అందరూ స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినపుడుతున్న మరో అనుమానం అసలు నిందితుడు రాజు బతికేఉన్నాడా? లేదా? అని.
మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా నిందితుడు రాజు గురించే వార్తలు. ఏ మాధ్యమంలో చూసినా రాజు ఫొటోలు, అతని పోలికలు, ఎలా ఉంటాడు అనే ప్రస్తావనే. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. మొత్తం హైదరాబాద్‌లో ప్రతి స్కేర్ కిలోమీటరుకు 480 సీసీ కెమెరాలు ఉన్నాయి. మొదటిసారి కనిపించిన తర్వాత మళ్లీ ఇంత వరకు సీసీ కెమెరాల్లో కూడా జాడ చిక్కలేదు. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లలో ఉద్యోగులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే అప్రమత్తం చేశారు. సామాన్యులు సైతం నిందితుడి కోసం గాలిస్తున్నారు. దాదాపు 70 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి, ఇంత మంది కళ్లు కప్పి నిందితుడు రాజు ఎక్కడ దాక్కున్నాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో.. నిందుతుడు రాజు బతికే ఉన్నాడా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. రాజు ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? ఇదే ప్రశ్న పోలీసులకి నిద్ర పట్టకుండా చేస్తోంది. ఒకవేళ రాజు ఈ సమాజంలోనే తిరుగుతూ ఉంటే మాత్రం అతన్ని త్వరగా పట్టుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.