మీరు మీ పిల్లలను బడికి పంపుతున్నారా..? అయితే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే మీ పిల్లలను ఇలాంటి లేడీ టీచర్లు కాటేయొచ్చు. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలియాలంటే కింద చదివేద్దాం..
అత్యాచారాలు, లైంగిక వేధింపులు సమాజంలో కొత్తేమీకాదు. దేశంలో ఎక్కడోచోట.. ఎవరో ఒకరిపై ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ చట్టాలు కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోయున్నాయి. ఇలాంటి ఘటనల్లో ఎక్కువుగా మహిళలు, బాలికలు బాధితులుగా ఉంటారు. కానీ, అమెరికాలో వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే.. సమాజంలో ఇలాంటి వారు కూడా అనిపించక మానదు. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు.. గత రెండు రోజుల వ్యవధిలోనే ఆరుగురు మహిళా ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. వీరు ఎంతమంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారన్న అన్న దానిపై లెక్కలు రాబట్టే పనిలో పడ్డారు.. పోలీసులు.
కెంటకీ రాష్ట్రంలోని డాన్‌విల్లేకు చెందిన ఎలెన్ షెల్(38 ఏళ్ల )పై థర్డ్ డిగ్రీ అత్యాచారానికి పాల్పడినట్టు కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఆమెపై దాఖలైన క్రిమినల్ ఫిర్యాదు ప్రకారం.. షెల్, ఇద్దరు 16 ఏళ్ల అబ్బాయిలతో మూడు సందర్భాల్లో లైంగిక చర్యలకు పాల్పడినట్టు పొందుపరిచారు. ఇక అర్కాన్సాస్‌కు చెందిన మహిళా టీచర్ హీథర్ హరే (32) ఫస్ట్ డిగ్రీ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ టీనేజ్ విద్యార్ధితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇక మరో ఘటనలో తాను చదువు చెప్పే విద్యార్థితో శారీరక సంబంధం పెట్టుకుందనే ఆరోపణలపై ఒకహామాకు చెందిన ఎమిలే హన్‌కాక్ (26) అనే మహిళా టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది.
15 ఏళ్ల విద్యార్థితో అనుచిత సంబంధానికి తెరతీసిందని హన్‌కాక్‌పై అభియోగాలు మోపారు. వెల్‌స్టన్ పబ్లిక్ స్కూల్స్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్న ఆమె.. తరగతి గదినే పడక గదిగా మార్చుకుని, లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు ప్రధాన ఆరోపణ. ఇరువురూ స్నాప్‌చాట్‌లో కూడా కమ్యూనికేట్ చేసినట్టు పోలీసులు బయటపెట్టారు. అలాగే అయోవాలోని డెస్ మోయిన్స్‌లోని క్యాథలిక్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న క్రిస్టెన్ గాంట్(36).. ఒక టీనేజ్ విద్యార్థితో తన స్కూల్ లోపల, వెలుపల ఐదుసార్లు లైంగిక చర్యల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై కేసు నమోదయ్యింది. ఇక మరో ఘటనలో జేమ్స్ మాడిసన్ హైస్కూల్‌లో అల్లీహ్ ఖేరద్‌మాండ్(33) అనే ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖేరద్‌మాండ్ నెలల వ్యవధిలోనే టీనేజ్ విద్యార్థితో పలుమార్లు లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు ప్రధాన ఆరోపణ. ఆమె 2016 నుంచి ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ స్కూల్స్‌లో లెర్నింగ్ డిజేబుల్టీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె.. తాను శిక్షణ పాఠాలు పక్కనపెట్టి శృంగార పాఠాలు భోదించారు. అలాగే పెన్సిల్వేనియాకు చెందిన జావెలిన్ త్రో కోచ్ హన్నా మార్త్ (26).. తన వద్ద శిక్షణ తీసుకుంటోన్న 17 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తేలడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్నా.. నార్తాంప్టన్ ఏరియా హైస్కూల్ కు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. చూశారుగా.. పాఠాలు బోధించాల్సిన టీచర్లు ఎలా చెలరేగిపోతున్నారో.. అందువల్లనే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం.. ఈ టీచర్లపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
6 teachers arrested for sex misconduct with students in two days
At least six female teachers were arrested in a span of two days this week for having sex with students — including a Kentucky staffer who allegedly had trysts with a pair of 16-year-old boys. Complaints about
/ pic.twitter.com/6K6lh45iuX— ᖇᗝᗝᔕᗴᐯᗴᒪ丅 丅ᗴᖇᖇᎥᗴᖇᔕ (@RTerriers) April 16, 2023