5 Star Hotel Biryani: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులో ఉన్నారు. దశలవారీగా పోలీసుల నిందితులను విచారిస్తున్నారు. అయితే, నిందితులంతా ప్రముఖుల వారసులు కావటంతో పోలీసుల అదుపులో ఉన్నా కూడా వారికి ఏ లోటూ రాకుండా రాచ మర్యాదలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆదివారం పోలీసులు తమ కస్టడీలో ఉన్న మైనర్ నిందితులతో సామూహిక అత్యాచార ఘటన క్రమాన్ని సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ ద్వారా రికార్డ్ చేశారు. ఆ తర్వాత నిందితులను స్టేషన్ కు తీసుకువచ్చారు. వీరికోసం ఓ స్టార్ హోటల్ నుంచి వచ్చిన మటన్ బిర్యానీ పార్సిళ్లు రెడీగా ఉంచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో “గ్యాంగ్‌రేప్ కేసు నిందితులకు రాచ మర్యాదలు.. స్టార్ హోటల్ బిర్యానీ పార్సిళ్లు” అంటూ పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఓ అధికారిని వివరణ అడిగితే ‘‘అవి మా స్టాఫ్ కోసం తెప్పించినవి’’ అని సమాధానం ఇవ్వగా .. మరో అధికారి అవి నిందితుల కోసమే అని ఒప్పుకున్నారట. నిందితులు అనారోగ్యం పాలైతే తమకు ఇబ్బందని, వారంతా సాధారణ భోజనం తినడానికి ఇష్టపడడం లేదని, మైనర్ల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాలని, తమ కస్టడీలో ఉండగా వారు పస్తులుండకూడదని వివరించారట. అయితే, పస్తులుండకూడదని అనుకుంటే మామూలు బిర్యానీ తెప్పిస్తే చాలు గదా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరికొందరు సిబ్బంది.. నిందితుల తరపువారే ఆ బిర్యానీ తీసుకువచ్చారని చెబుతున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Amnesia Pub Case: అమ్నేషియా పబ్ కేసులో విస్తుపోయే నిజాలు.. ఆ ఇంగ్లీష్ సినిమాలు చూసి కిడ్నాప్, అత్యాచారం!