పట్ట పగలు.. అది కూడా ట్రాఫిక్‌లో కొందరు దొంగలు తమ చేతి వాటం చూపించారు. ఏకంగా 40 లక్షల రూపాయలను క్షణాల్లో దొంగిలించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దొంగలు తెలివి మీరి పోయారు. తెలివితో పాటు బరితెగించేశారు. పగటి పూట.. అది కూడా నడిరోడ్లపైనే దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. బిజీ ట్రాఫిక్‌లో ఉన్న వారి వస్తువుల్ని కొట్టేయటం పనిగా పెట్టుకున్నారు. అయితే, వారు చేసిన తప్పులన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయి, చివరకు కటకటాల పాలవుతున్నారు. తాజాగా, ఓ దొంగల ముఠా పట్ట పగలు.. అది కూడా ట్రాఫిక్‌లో భారీ దొంగతనం చేసింది. ఓ బైకు నుంచి ఏకంగా 40 లక్షల రూపాయలు కొట్టేసింది. చివరకు సీసీటీవీ కెమెరాల కారణంగా పోలీసులకు చిక్కి జైలు పాలైంది. ఈ సంఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిని వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి దాదాపు 40 లక్షల రూపాయలు డ్రా చేసుకుని బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాగును తన వీపునకు తగిలించుకుని, బైకుపై బయలుదేరాడు. అతడు రోడ్డుపై వెళుతున్న సమయంలో ఓ చోట ట్రాఫిక్ కారణంగా భారీగా వాహనాలు ఆగిపోయాయి. బైకు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. బ్యాగు జిప్పు తీసి ఉండటం వల్ల లోపల ఏముందో క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ట్రాఫిక్‌లో ఉన్న ఆకాశ్, అభిషేక్‌తో పాటు మరికొందరు ఆ డబ్బును చూశారు. ఎలాగైనా ఆ డబ్బుల్ని దొంగిలించాలనుకున్నారు. ఆకాశ్, అభిషేక్ మెల్లగా బైక్‌ను ఫాలో అయ్యారు. ఓ చోట ఆకాశ్ బ్యాగు లోపల చెయ్యి పెట్టి డబ్బుల్ని బయటకు తీశాడు.
తర్వాత అందరూ అక్కడికి నుంచి పరారయ్యారు. అయితే, ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కామెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 38 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ట్రాఫిక్‌లో వెళ్లే బైకులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి, ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ఇలాంటి దొంగతనాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#NDTVBeeps | On CCTV: Robbers Steal ₹ 40 Lakh From Biker’s Bag At Delhi Traffic Signal pic.twitter.com/PSVgs0eNDH
— NDTV (@ndtv) March 7, 2023